తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టిల్లు స్క్వేర్​ కుమ్మేశాడు భయ్యా - డే 1 ఎన్ని కోట్లంటే? - TILLU SQUARE DAY 1 COLLECTIONS - TILLU SQUARE DAY 1 COLLECTIONS

Siddu Jonnalagadda Anupama Parameswaran Movie : సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్​ కూడా మస్త్​గా వస్తున్నాయి. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

టిల్లు స్క్వేర్​ కుమ్మేశాడు భయ్యా - డే 1 అదిరిపోయే వసూళ్లు
టిల్లు స్క్వేర్​ కుమ్మేశాడు భయ్యా - డే 1 అదిరిపోయే వసూళ్లు

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 8:38 AM IST

Updated : Mar 31, 2024, 9:19 AM IST

Siddu Jonnalagadda Anupama Parameswaran Movie :లేటెస్ట్ రిలీజ్​ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ వసూళ్లు మంచిగా వచ్చాయి. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్‌గా బోల్డ్ క్యారెక్టర్​లో నటించి మెప్పించింది.

ఇకపోతే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీటీమ్ కూడా​ అధికారికంగా సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. బుక్​ మైషోలో 9.3 రేటింగ్, పేటీఎమ్​లో 95 శాతం, గూగుల్​లో 4.7/5, ఐఎమ్​డీబీలో 8.4/10 ఆడియెన్స్​ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపింది.

కలెక్షన్స్​ వివరాల విషయానికొస్తే నార్త్ అమెరికాలో 950కే డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. అంటే 1 మిలియన్​ డాలర్స్​కు చేరువగా ఉంది. ఇంకా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్ల వరకు షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 8.50 కోట్ల వరకు వచ్చిందట. అలానే ఓవర్సీస్​లో డే1 గ్రాస్​ రూ.10కోట్ల వరకు ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ లెక్కలన్నీ చెప్పకుండా ఓవరాల్​గా ఫస్ట్​ డే రూ. 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేసింది. టిల్లు గాడితో అట్టుంటది, సినిమా డబుల్ బ్లాక్ బస్టర్​ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్​, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ అందించారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సినిమా రివ్యూ విషయానికొస్తే టిల్లు పాత్రలో సిద్ధు అల్లరి బాగా కనెక్ట్ అయింది. అనుపమ అందచందాలు, కథలోని వినోదం, కొన్ని ట్విస్ట్‌లు చిత్రానికి బలాలుగా నిలిచాయి. అయితే కథ మాత్రం రొటీనే. కాని ఫైనల్​గా అట్లుంటది టిల్లుతోని అంటూ డబుల్‌ ఎంటర్‌టైనర్‌ పంచాడు టిల్లు స్క్వేర్‌.

టిల్లు స్క్వేర్ మ్యాజిక్​​ - అనుపమ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే! - Tillu Square

షాకింగ్ - ప్రముఖ కోలీవుడ్ విలన్ క‌న్నుమూత‌ - Daniel Balaji Died

Last Updated : Mar 31, 2024, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details