2024 Highest Collected Movies In India :2024 భారతీయ సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పాలి. ఈ ఏడాదిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో విడుదలైన వివిధ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలో అనేక సినిమాలు వందలాది కోట్లు వసూళ్లు సాధించాయి. మరి ఈ లిస్ట్‌లో ఏయే సినిమాలు ఉన్నాయో చూద్దాం
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ముఖ్యంగా తెలుగు సినిమాల హవా నడిచింది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో నాలుగు టాలీవుడ్వే. అందులోనూ టాప్- 2 సినిమాలు తెలుగువే కావడం విశేషం.
పుష్ప రూలింగ్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' ఈ ఏడాది ఇండియన్ సినిమాను రూల్ చేసింది. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా 21 రోజుల్లోనే ఏకంగా రూ. 1705 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ క్రమంలో 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది.
కల్కి ఏడీ 2898 : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'కల్కి ఏడీ 2898' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇతిహాసానికి సైన్స్‌ఫిక్షన్ ముడిపెట్టి తీసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్‌లో రిలీజైన ఈ సినిమా రూ. 1200 కోట్లు వసూల్ చేసి, రెండో స్థానంలో నిలిచింది.
- స్క్రీ 2 (హిందీ) - శ్రద్ధా కపూర్ - రూ.874 కోట్లు
- దేవర పార్ట్ 1 (తెలుగు)- జూనియర్ ఎన్టీఆర్- రూ. 521 కోట్లు
- గోట్ (తమిళం)- విజయ్ దళపతి- రూ. 456 కోట్లు
- భూల్ భలయ్య 3 (హిందీ) - కార్తిక్ ఆర్యన్- రూ. 417 కోట్లు
- సింగం అగైన్ (హిందీ)- అజయ్ దేవగన్- రూ.389 కోట్లు
- హను- మాన్ (తెలుగు)- తేజ సజ్జ- రూ. 350 కోట్లు
- ఫైటర్ (హిందీ)- హృతిక్ రోషన్- రూ. 344 కోట్లు
- అమరన్ (తమిళం)- శివకార్తికేయన్- రూ.335 కోట్లు
'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 21 రోజుల్లోనే రూ.1700 కోట్లు వసూల్
'కల్కి' ర్యాంపేజ్ కంటిన్యూ- దెబ్బకు షారుక్ సినిమా రికార్డ్ బ్రేక్ - Kalki Boxoffice