ETV Bharat / entertainment

SSMB హీరోయిన్ ఫిక్స్- మహేశ్​కు జోడీగా గ్లోబల్ బ్యూటీ? - SSMB 29 HEROINE

SSMB లేటెస్ట్ బజ్- హీరోయిన్​ కన్ఫార్మ్- షూటింగ్ ఎప్పుడంటే?

SSMB 29 Heroine
SSMB 29 Heroine (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 15 hours ago

SSMB 29 Heroine : సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ 'SSMB 29'. ఈ సినిమా కోసం యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇటీవల రాజమౌళి ఆఫ్రికా ట్రిప్ నుంచి పలు ఫొటోలు షేర్ చేసి, సినిమాపై హైప్ పెంచేశారు. అలా సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాను మేకర్స్​ భారీ బడ్జెట్​తో తెరకెక్కించనున్నారు. అసలే అక్కడుంది రాజమౌళి. ఆయన ఏ చిన్న విషయంలోనూ రాజీ పడరు. అందుకే సినిమాలో హీరోయిన్​ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ నటిని​ సంప్రదించారని టాక్. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా. మిస్ వరల్డ్ పోటీల్లో నెగ్గిన ప్రియాంక, బాలీవుడ్​లో కెరీర్ ప్రారంభించింది.

దాదాపు 20ఏళ్ల పాటు బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా రాణించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల దాకా వెళ్లిపోయింది. అలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ సంపాదించిన ప్రియాంకను సినిమాలో తీసుకుంటే హాలీవుడ్​ లెవెల్​లోనూ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారేమో! కానీ, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి జక్కన్న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న సినిమాలో మహేశ్​తో ఏ అమ్మడు జోడీ కట్టనుందో?

షూటింగ్ అప్పుడే షూరు : ఇక ఈ సినిమా కన్ఫార్మ్ అయ్యి చాలా రోజులు గడుస్తున్నా, షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ గ్యాప్​లో అటు జక్కన్న, ఇటు మహేశ్ బాబు ఫారిన్​ ట్రిప్స్​ కూడా వెళ్లారు. అయితే 2025 ఏప్రిల్​లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట.

సినిమా కథ విషయానికొస్తే, ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి . అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు.

SSMB 29పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

'SSMB' బడ్జెట్ రూ.1000కోట్లు- రూ.4వేల కోట్ల కలెక్షన్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.