తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'భారతీయుడు 2' - వారందరికి ఎంతో కీలకం! - Indian 2 Movie - INDIAN 2 MOVIE

KamalHassan Bharateeyudu 2 Release : భారతీయుడు 2 రిలీజ్​కు రెడీ అయింది. ఈ సందర్భంగా సినిమా ముందున్న సవాళ్లు ఏంటో తెలుసుకుందాం.

source ETV Bharat
KamalHassan Bharateeyudu 2 (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 11:46 AM IST

KamalHassan Bharateeyudu 2 Release:మరో రోజులో భారతీయుడు 2 విడుదల కానుంది. గతంలో రిలీజైన భారతీయుడును దృష్టిలో పెట్టుకోవడంతో రెండో భాగంపైనా మంచి అంచనాలే ఉన్నాయి. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సంగా లేవు. ప్రీమియర్, మార్నింగ్ షోల నుంచి వచ్చే మౌత్​ టాక్​ కీలకం కానుంది. అయితే భారతీయుడు 2 ముందు పలు సవాళ్లు ఉన్నాయి. ఇంతకుముందు విక్రమ్​ సాధించిన సక్సెస్ కేవలం ఆ ఒక్క చిత్రానికే పరిమితం కాకూడదని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే ఆయనే స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. మరోసారి తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు.

ఇక తెలుగులో సక్సెస్ లేక ఏళ్ళు గడిచిపోయిన హీరో సిద్దార్థ్. ఈ చిత్రంలో ఆయన చేసింది అతిథి పాత్రేమి కాదు. ఫుల్ లెంగ్త్ రోలే. కాబట్టి ఈ చిత్రం హిట్ అయితే సిద్ధార్థ్​కు​ కూడా మళ్లీ కాస్త క్రేజ్ పెరగొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీని కోసమే ఎదురు చూస్తోంది. పాటలు, మ్యూజిక్​ విషయానికొస్తే తొలి భాగంలో సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సారి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అంత ఎఫెక్టివ్​గా కనిపించట్లేదని అంటున్నారు. కాబట్టి బీజీఎం ఎలా ఉంటుందో చూడాలి. దర్శకుడు శంకర్ కూడా తన కంబ్యాక్​ను ఈ చిత్రంతోనే రుజువు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్​పై భారతీయుడు 2 రిజల్ట్ ఎఫెక్ట్​ కచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. ఈ చిత్రం బాగుంటేనే ఆయనపై నమ్మకం మరింత బలపడుతుంది. ఇలా రకరకాల క్యాలికులేషన్లు భారతీయుడు 2 ముందున్నాయి. వాటిని దాటుకుని కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ జోష్​ను కమల్ హాసన్ ఏ మేరకు కొనసాగిస్తారో చూడాలి.

ఆ కండిషన్​తో టికెట్​ రేట్స్​ పెంపు - ఇకపోతే భారతీయుడు 2 సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. కాకపోతే సినిమా ప్రారంభానికి ముందు డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే కండిషన్ పెట్టింది. చిత్రంలో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

'భారతీయుడు 2' బుకింగ్స్ - టికెట్​ రేట్స్​ ఎంత పెంచారంటే?

అప్పట్లోనే 25 లక్షల క్యాసెట్లు - భారతీయుడు సాధించిన రికార్డులు తెలుసా? - Bharateeyudu 2 Movie

ABOUT THE AUTHOR

...view details