తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజాసాబ్'​ సంజయ్​ దత్​ లగ్జరీ లైఫ్ - ఈ స్టార్ హీరో ఆస్తి విలువ ఎన్ని వందల కోట్లంటే? - Sanjay Dutt Networth - SANJAY DUTT NETWORTH

Sanjay Dutt Networth : బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అగ్నీపథ్, మున్నాభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ స్టార్ నటుడు. అయితే ఈయన నెట్‌వర్త్ ఎంతంటే?

Sanjay Dutt Networth
Sanjay Dutt (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 12:20 PM IST

Sanjay Dutt Networth : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు ఈ మధ్య తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. విభిన్న పాత్రల్లో నటించి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో 'రాకీ' అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజూ భాయ్ ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

'సాజన్', 'సడక్', 'ఖల్నాయక్', 'ఆతిష్', 'హసీనా మాన్ జాయేగీ', 'అగ్నీపథ్' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతలో వేసుకున్నారు.'మూన్నాభాయ్' ఎంబీబీస్ సినిమాలో ఈయన కాకుండా ఎవరూ బాగా నటించలేరనీ ఇప్పటికీ అంతా అనుకుంటారు.'గ్యాంగ్‌స్టర్', పోలీసు పాత్రల్లో ఈయన నటన చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.

దిగ్గజ నటుడు సునీల్ దత్, నటి నర్గీస్ దత్‌ల కుమారుడే ఈ సంజయ్ దత్. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికంగా ఆయన ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. చిన్నప్పటి నుంచీ ఆయన లగ్జరీ లైఫ్‌నే లీడ్ చేస్తున్నారు. సినిమాలే కాకుండా సంజయ్ దత్ ఫిల్మ్ ప్రొడక్షన్, త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్ వంటి సొంత నిర్మాణ సంస్థల ద్వారా కూడా ఈయన ఆదాయం గడిస్తున్నారు.

ప్రస్తుతం సంజూ నెట్‌వర్త్‌ దాదాపు రూ.295 కోట్లని సమాచారం. ముంబయిలో పాలీ కొండ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో ఆయన నివసిస్తున్నారు. ఆయన సతీమణి మాన్యతా దత్తా దాదాపు రూ.7.9 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ హోస్ట్‌తో పాటు ఆడీ క్యూ7 SUVని ఆయనకు బహుమతిగా ఇచ్చింది. ఇవేకాకుండా సంజూ దగ్గర ఫెరారీ 599 జీటీబీ, బీఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ కూడా ఉన్నాయి. తాజాగా ఆయన రేంజ్ రోవ్ ఆటోబయోగ్రఫీ ఎల్ డబ్ల్యూబీని కూడా కొనుక్కున్నారట. ఇది దాదాపు 3.5కోట్ల ధర పలుకుతుందని ట్రేడ్ వర్గాల మాట.

బైక్ లవర్ అయిన సంజయ్ హార్లీ డేవిడ్‌సన్‌ను రైడ్ చేసేందుకు ఇష్టపడుతారట. వీటితో పాటు సంజూ ఓ ప్రైవేట్ యాచ్ కూడా కొన్నారని, అందులో కేవలం ఫ్యామిలీ, అత్యంత సన్నితులతో మాత్రమే ట్రిప్‌లకు వెళ్తుంటారని తెలిసింది. ఆస్తికి తగ్గట్లుగానే సంజూ ఎప్పుడూ ఖరీదైన వస్తువులనే వాడుతుంటారట. ఆయన ఎప్పుడూ రోలెక్స్, హబ్లోట్, కార్టియర్ వంటి లగ్జరీ వాచీలనే వాడతారట. ఆయన వాడే జ్యుయెలరీ, సన్ గ్లాసెస్ వంటి అన్ని వస్తువులు హె ఎండ్ ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారట.అయితే సంజయ్ గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈయనో పెట్ లవర్. ఎన్నో ఏళ్లుగా ఈయన చాలా రకాల పెట్స్‌ను పెంచుకుంటున్నారట.

ఇక సంజయ్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2, ఇస్మార్ట్ శంకర్ లోనూ నెగిటివ్ పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో కూడా ఈయన కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్​తో బాలీవుడ్​ బిగ్​బుల్ ఫైట్​​.. పూరి మైండ్ బ్లోయింగ్ ప్లాన్​!

'డ్రగ్స్‌ నిషా.. రెండు రోజులు లేవలేదు.. ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు!'

ABOUT THE AUTHOR

...view details