తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత - SAMANTHA RECALLS CITADEL SHOOTING

'సిటాడెల్'​ వెబ్​ సిరీస్​ షూటింగ్ నాటి రోజులను గుర్తుచేసుకున్న హీరోయిన్ సమంత

Samantha Citadel Webseries
Samantha Citadel Webseries (source Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 10:08 AM IST

Samantha Citadel Webseries : హీరోయిన్ సమంత సిటాడెల్​ వెబ్​ సిరీస్​తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్​లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న సమంత, సిరీస్​తో పాట తన వ్యక్తిగతకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతోంది.

అయితే మయోసైటిస్‌ కారణంగా తాను ఈ వెబ్‌ సిరీస్‌ను రిజెక్ట్​ చేయాలని అనుకున్నట్లు సమంత గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి మరోసారి మాట్లాడింది. "ఈ స్క్రిప్ట్‌ చదివాక నేను చేయగలనా అనుకున్నాను. నేను ఈ సిరీస్​లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒక్కో రోజు నా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఉదయం నాలుగు గంటలకే షూట్‌కు వెళ్లేదాన్ని. అలానే మధ్యాహ్నం వరకు యాక్షన్‌ సీన్స్​ షూట్​లో పాల్గొనేదాన్ని. రోజు చాలా కష్టంగా గడిచేది. నువ్వు షూట్‌ చేయగలవా అని రాజ్‌ చాలా సార్లు నన్ను అడిగేవారు. చేయలేనని చెప్పేదాన్ని. అయినా కూడా ఈ సిరీస్‌ పూర్తి చేశానంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది" అని సమంత సిటాడెల్​ షూటింగ్‌ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

సమంతపై ఆ దర్శకుడు ప్రశంసలు - "సమంతను దర్శకుడు అట్లీ చాలా సార్లు ప్రశంసించారు. సామ్​ను ఫిల్మ్‌ స్టార్‌ అని అంటుంటాడు. మేము సామ్ గురించి ఎప్పుడు మాట్లాడినా అట్లీ ఆమెను సూపర్‌ స్టార్‌ అనే పిలుస్తుంటాడు. ఆమె వర్క్‌కు అట్లీ కూడా అభిమానే. సమంత సూపర్ యాక్టర్​. ఆమె అద్భుతమైన నటి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఆమెతో కలిసి నటించిన కొన్ని సీన్స్​ చాలా సరదాగా సాగాయి. సినిమాపై మా ఇద్దరికి ఉన్న అభిరుచి వల్ల త్వరగా కనెక్ట్‌ అయిపోయాం. మేమిద్దరం ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉంటాం." అని వరుణ్‌ ధావన్ చెప్పుకొచ్చారు.

సిటాడెల్ వెబ్​ సిరీస్​ యాక్షన్‌ థ్రిల్లర్​గా తెరకెక్కింది. సిరీస్​లో సమంత హనీ అనే పాత్రలో స్పై ఏజెంట్‌గా నటించింది. రీసెంట్​గా ఈ సిటాడెల్ సిరీస్​ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా దీనిపై ప్రశంసలు కురిపించారు. సిరీస్‌ విడుదల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్​లో సమంత 'సిటాడెల్'​ - ఈ సిరీస్​ కోసం ఆమె ఎన్ని కోట్లు తీసుకుందంటే?

'టార్జాన్' హీరో కన్నుమూత - సినీ ప్రముఖులు సంతాపం

ABOUT THE AUTHOR

...view details