సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అప్పటి వరకు స్టార్ హీరోలుగా రాణించిన వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతుంటారు. సైడ్ క్యారెక్టర్ వేసే వారు ఓవర్‌నైట్ స్టార్స్గానూ ఎదిగిపోతారు. ఇలాంటి సంఘటనలు చిత్ర సీమలో ఎన్నో. అయితే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఓ స్టార్ హీరోకు(జాకీష్రాఫ్) అసిస్టెంట్‌గా పని చేసిన ఓ కుర్రాడు ప్రస్తుతం ఓ సినిమాకు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు.
వివరాల్లోకి వెళితే. బాలీవుడ్‌గా మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన జాకీ ష్రాఫ్ మొదట ఓ చిన్న పాత్రతో సినీ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాత 'హీరో' సినిమా ఆయన కెరీర్ మలుపు తిప్పింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడం వల్ల జాకీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అనంతరం ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. పలు అవార్డులను కూడా అందుకున్నారు.
అలా జాకీ ష్రాఫ్ బీటౌన్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో ప్రముఖ రచయిత, దర్శకుడు సలీం ఖాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. 1988లో ఫలక్ అనే పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌నే అందుకుంది. ఈ చిత్రానికి సలీం ఖాన్ కుమారుడు, ప్రస్తుతం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో జాకీ ష్రాఫ్‌కు అసిస్టెంట్‌గా ఉన్నారు.