తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ వ్యక్తి ఏమీ దొంగిలించలేదు - బాబు దగ్గరికి దుండగుడిని రానివ్వకుండా సైఫ్​ కాపాడాడు - SAIF ALI KHAN ATTACK

సైఫ్​ అటాక్​ కేసులో ట్విస్ట్​ - పోలీసులకు స్టేట్​మెంట్ ఇచ్చిన కరీనా కపూర్

Saif Ali Khan Health Update
Kareena Kappor Saif Ali Khan (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 1:06 PM IST

Saif Ali Khan Health Update : దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ క్రమంగా కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. ఐసీయూ నుంచి సైఫ్​ను సాధారణ వార్డుకు తరలించామని వెల్లడించారు. అయితే తాజాగా నటుడి సతీమణి కరీనా కపూర్‌ స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు.

దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని ఆమె చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కానీ సైఫ్ మాత్రం కేర్​టేకర్​ను కాపాడి తన బిడ్డ వద్దకు దుండగుడు వెళ్లకుండా కాపాడారని అన్నారు. అయితే అతడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని పేర్కొన్నారు.

'నార్మల్​ ఫుడ్ తీసుకుంటున్నారు'
"సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన నడుస్తున్నారు. అలాగే నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించాం. ఆస్పత్రి వైద్యుల బృందం శ్రమించి సైఫ్ ను నడిచేలా చేసింది. సైఫ్​కు చేతికి రెండు, మెడకు కుడివైపున ఒక గాయం అయ్యింది. ప్రధాన గాయం వెన్నుముక దగ్గర తగిలింది. సైఫ్‌ వెన్నులో చిక్కుకున్న కత్తిని తొలగించాం." అని లీలావతి ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు.

నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్
మరోవైపు, సైఫ్ అలీఖాన్​పై దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి సెర్చ్ అపరేషన్ నిర్వహిస్తున్నారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ఆపి దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే పోలీసు రికార్డుల్లో ఇప్పటికే పేర్లు ఉన్న వ్యక్తులను కూడా విచారణ కోసం పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు 15 మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. అలాగే సైఫ్ సిబ్బందిని పోలీస్ స్టేషన్​కు రప్పించి విచారణ చేపట్టారు.

అసలేం జరిగిందంటే?
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్​పై గురువారం రాత్రి దాడి జరిగింది. ముంబయిలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సైఫ్​ను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. సైఫ్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. మరోవైపు సైఫ్​పై జరిగిన దాడి గురించి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సైఫ్ ఈజ్ సేఫ్​- వెన్నెముక నుంచి కత్తిని తొలగించాం: వైద్యులు

కేర్​టేకర్​ను బెదిరించి చేసి రూ. కోటి డిమాండ్​! - సైఫ్​పై అటాక్​కు అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details