RRR Rajamouli Alia Bhatt : తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ అనగానే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున గుర్తొచ్చే పేరు దర్శకధీరుడు రాజమౌళి. ఆయనతో కలిసి సినిమా చేసేందుకు ఇండియా వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్స్ అంతా ఎంతో ఆశపడుతుంటారు. ఎందుకంటే జక్కన్నతో సినిమా చేస్తే ఏ హీరో లేదా హీరోయిన్ అయినా వరల్డ్ వైడ్‌గా టాప్ రేంజ్‌కు వెళ్లాల్సిందే. అయితే జక్కన్న ఓ స్టార్ హీరోయిన్‌కు సినిమాల ఎంపిక విషయంలో ఓ సలహా ఇచ్చారంట. దాన్ని ఇప్పటికీ ఆ స్టార్ హీరోయిన్ పాటిస్తూనే ఉందట. ఆ విషయాన్ని తాజాగా తనే స్వయంగా చెప్పింది.
ఇంతకీ ఆమె ఎవరంటే? బాలీవుడ్ బడా కథానాయిక అలియా భట్. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన అడ్వైస్‌ను షేర్ చేసుకుంది. "సినిమాలను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఫస్ట్ నుంచి నేను ఒత్తిడికి గురౌతుంటాను. ఇదే విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పాను. అప్పుడు ఆయన ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఆడియెన్స్ మాత్రం కచ్చితంగా మీ యాక్టింగ్‌ను ప్రశంసిస్తారు. మీకు పక్కాగా కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది మరేమీ లేదు అని చెప్పారు. అప్పటి నుంచి దాన్నే కంటిన్యూస్‌గా పాటిస్తున్నాను. పరిశ్రమలోకి వచ్చిన కెరీర్ ప్రారంభంలో నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథకు ఓకే చెప్పేదాన్ని. వాస్తవంగా చెప్పాలంటే నాకు సహనం చాలా తక్కువ. ఇప్పుడు అది మారింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతటి కష్ట పాత్రనైనా చేయాలని డిసైడ్ అయ్యాను" అని అలియా చెప్పుకొచ్చింది.