తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కొత్త వాళ్లను ప్రోత్సహిస్తారు - ఆయన వల్లే మేము ఈ పొజిషన్​లో ఉన్నాము' - Ritesh Genelia On Ramoji Rao Demise - RITESH GENELIA ON RAMOJI RAO DEMISE

Ritesh Genelia On Ramoji Rao Demise : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ రితేశ్​ దేశ్​ముఖ్, జెనీలియా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Ramoji Rao Demise
Ramoji Rao (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 8:47 AM IST

Ritesh Genelia On Ramoji Rao Demise: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సినిమాల విషయంలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది. యధార్థ ఘటనలను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని వాటిని సినిమాలుగా మలిచి ఇండస్ట్రీకి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. ఈ క్రమంలోనే ఆయన ఎంతో మంది కొత్త తారలను చిత్ర పరిశ్రమకు అందించారు. ఉషాకిరణ్​ మూవీస్ బ్యానర్​ ద్వారా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలు నిర్మించి అక్కడి ప్రేక్షకులను చేరువయ్యారు.

ఇలా తన విజన్​తో ఎంతో మందికి ఇన్​స్పిరేషన్​గా నిలిచిన రామోజీ మరణ వార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసింది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం, హిందీ సహా ఆయా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ నటులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఇక రామోజీరావు ఇండస్ట్రీకి పరిచయం చేసిన తారల్లో బాలీవుడ్ నటులు రితేశ్ దేశ్​ముఖ్​, జెనీలియా కూడా ఉన్నారు. ఆయన 2004లో నిర్మించిన 'తుఝే మేరీ కసమ్' అనే చిత్రం ద్వారా ఈ జంట హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి ఈ ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత జెనీలియా టాప్ స్టార్​గా ఎదిగి తెలుగులో రామ్, విష్ణు, నితిన్ సహా అనేక మంది అగ్ర హీరోల సరసన నటించింది. ఇక రితేశ్ కూడా ప్రస్తుతం బాలీవుడ్​లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

కాగా, రితీష్, జెనీలియా రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన మమల్ని నమ్మడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామంటూ ఎమోషనల్ అయ్యారు. 'కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనే ఆయన నమ్మకం వల్లే నేనూ జెనీలియా ఇప్పుడు నటులుగా ఉన్నాం. ఈ విషయానికి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన లెగసీ ఎప్పటికీ కొనసాగుతుంది' అంటూ రితేశ్, జెనీలియా ఎమోషనల్ అయ్యారు.

సినీరంగంలో రామోజీ ప్రస్థానం- ఆయన పరిచయం చేసిన నటులెందరో - Ramoji Rao Introduced Heros

'వేలాది మంది జర్నలిస్టులను అందించారు- ఇలా జరగడం బాధాకరం'

ABOUT THE AUTHOR

...view details