తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రీరిలీజ్ రికార్డ్స్​ - టాప్​లో ఎవరున్నారంటే? - Rerelease records - RERELEASE RECORDS

Rerelease records : కొన్ని పాత్రలు, కొన్ని సినిమాలను ఎన్ని ఏళ్లైనా మర్చిపోలేం. ఎన్ని సార్లైనా వాటిని మళ్లీ మళ్లీ చూడాలని ఆశ పడుతుంటాం. అలా అభిమానులకు నచ్చిన సినిమాలు కొన్ని ఈ మధ్య రీరిలీజ్ అయి రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి. అలా రీరిలీజ్ అయిన వాటిలో ప్రస్తుతం టాప్ కలెక్షన్స్​ సాధించిన చిత్రాలేంటో చూసేద్దాం.

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 8:23 PM IST

Rerelease records :తమ అభిమాన నటుడి సూపర్ హిట్ సినిమాలను, నచ్చిన కొన్ని సన్నివేశాలను ఏన్నేళ్లైనా సరే మళ్లీ మళ్లీ చూడాలని అందరికీ ఉంటుంది. అందుకే ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలను రీరిలీజ్ పేరుతో ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. దీంతో ఈ రీరిలీజ్ పద్ధతి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రీసెంట్​గా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గిల్లీ ఈ మధ్యే రీరిలీజై అదిరిపోయే వసూళ్లను సాధించింది. కళ్లు చెదిరే రేంజ్​లో కలెక్షన్లను అందుకుని టాప్​లో నిలిచింది.

  • గిల్లీ(తమిళం)
    కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్​గా నటించిన చిత్రం గిల్లీ. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. రీరిలీజ్​లోనూ "గిల్లీ"కి మంచి ఆదరణే లభించింది. ఇరవై ఏళ్ల తర్వాత తాజాగా మళ్లీ విడుదలైన ఈ సినిమా తొలి రోజే సుమారు రూ.10కోట్ల గ్రాస్ వసూల్లు సాధించి అదిరిపోయే రికార్డు అందుకుంది. అలా 6 రోజుల్లోనే దాదాపు రూ. 17.70కోట్ల వసూళ్లు అందుకుని రికార్డు సృష్టించింది. కాగా, " గిల్లీ" తెలుగులో మహేశ్​ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన "ఒక్కడు"కు రిమేక్.
  • ఖుషీ
    ఇక తెలుగులో రీరిలీజ్ అయి సినిమాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రం ఖుషి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక కథానాయికగా నటించిన ఈ మూవీ 2001లో విడుదలై ఏరేంజ్​లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రీరిలీజ్​లోనూ ఖుషీ సినిమా రూ.7.46కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ రీరిలీజ్ అయిన ఏ టావీవుడ్ మూవీ ఈ రేంజ్​లో కలెక్షన్లు సాధించలేకపోయింది.
  • బిజినెస్ మ్యాన్
    2012లో విడుదలైన బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేశ్​ బాబు పాత్ర అంటే పిచ్చ క్రేజ్. ఆయన కాజల్​ కలిసి నటించిన ఈ చిత్రం అప్పట్టో సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను అందుకుంది. రీరిలీజ్​లోనూ అంతే రేంజ్​లో సక్సెస్​ అందుకుని రూ.5.85కోట్ల కలెక్షన్లు సాధించింది.

    *స్పదికం(మలయాళం)
    మలయాళీ ఫేమ్ మోహన్ లాల్ నటించిన స్పదికం చిత్రం 1995లో విడులై మంచి ఆచరణ పొందింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రీరిలీజ్​లోనూబాక్సాఫీస్​ దగ్గర రూ.4.90కోట్ల కలెక్లన్లను సాధించింది.


    *సింహాద్రి
    దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కించిన సింహాద్రి చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్​గా చెప్పచ్చు. ఇందులో తారక్ సరసన భూమిక నటించింది. ఈ చిత్రం రీరిలీజ్​లో రూ.4.60కోట్ల వరకు దక్కించుకుంది.

    *ఈ నగరానికి ఏమైంది
    రీరిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం రీరిలీజ్ లోనూ రూ.3.52కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్యర్యపరిచింది.


    * సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
    స్టార్ హీరో సూర్య హీరోగా సిమ్రన్, సమీరా రెడ్డిలు కథానాయికలుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా అప్పట్లో యూత్​ను తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ థియోటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.3.40కోట్ల కలెక్షన్లు సాధించింది.

ABOUT THE AUTHOR

...view details