Saif Ali Khan Health Update : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి ఓ కత్తిని తొలగించినట్లు ప్రకటించారు. అయితే సైఫ్ ఎడమ చేయి, మెడపై తీవ్రగాయాలు అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.
VIDEO | Mumbai: " we are here to inform you that mr saif ali khan's operation was successful. both his neurosurgery and plastic surgery have been completed. he has been shifted from the operation theater to the icu for a one-day observation. tomorrow, we will decide on the next… pic.twitter.com/C5KpPDsVqJ
— Press Trust of India (@PTI_News) January 16, 2025
ఆటోలో ఆస్పత్రికి!
అయితే గాయపడ్డ సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు పలు వార్తలు ప్రచురితమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఏ కారు కూడా రెడీగా లేదని, ఇబ్రహీం తన తండ్రిని ఓ ఆటోలో తీసుకువచ్చాడని ఆ వార్తల సారాంశం.
దొంగ దొరికాడుగా!
మరోవైపు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, చోరీ కోసమే నిందితుడు అక్కడికి వచ్చినట్టు తేలిందని అన్నారు. వెనుక మెట్ల ద్వారా అతడు సైఫ్ ఇంట్లోకి వచ్చాడని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, సైఫ్ నివాసానికి చేరుకొని అక్కడ పనిచేస్తోన్న వారందరినీ ప్రశ్నించారు. ఫ్లోర్ పాలిషింగ్ చేసే వ్యక్తులను కూడా విచారించారు.
అయితే దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు కన్ఫార్మ్ చేశారు. అంతేకాకుండా సైఫ్ ఇంట్లోని సిబ్బందిలోనే ఎవరో ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#WATCH | Over attack on Actor Saif Ali Khan,
— ANI (@ANI) January 16, 2025
Dixit Gedam, DCP Zone 9, Mumbai Police says, " last night, "the accused used a fire escape staircase to enter saif ali khan's house. it appears to be a robbery attempt. we working to arrest the accused. 10 detection teams are working… pic.twitter.com/g6oLZH9w7f
ఇదీ జరిగింది :
బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సైఫ్ తన కుటుంబసభ్యులతో నిద్రిస్తున్నసమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేహ్ గదిలో దూరినట్లు పలు వార్తలు వచ్చాయి. అయితే దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేసింది. దీంతో సైఫ్ హడావుడిగా అక్కడికి చేరుకొన్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్‌పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందనని ఆ వార్తల్లో ఉంది.
సైఫ్ అలీఖాన్‌పై ఎటాక్- ఆరు సార్లు పొడిచి పరారైన దుండగుడు
షూటింగ్లో ప్రభాస్‌కు గాయం- ఆ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లడం కష్టమే!