తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షూటింగ్​లో ప్రభాస్​కు గాయం- ఆ సినిమా ప్రమోషన్స్​కు వెళ్లడం కష్టమే! - PRABHAS INJURED

రెబల్ స్టార్​ ప్రభాస్​కు గాయం- దీంతో ప్రమోషన్స్​కు దూరం!

Prabhas Injured
Prabhas Injured (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2024, 3:03 PM IST

Prabhas Injured :పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్​లో పాల్గొంటుండగా ఆయన కాలు బెణికింది. చికిత్స చేపట్టిన వైద్యులు ప్రభాస్​కు విశ్రాంతి సూచించారు. తమ అభిమాన హీరోకు గాయం అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు.

అయితే జపాన్​లో 'కల్కి 2898 ఏడీ' సినిమా 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ ప్రభాస్​తో అక్కడ ప్రమోషన్స్​ ప్లాన్ చేశారు. కానీ, తాజా గాయం కారణంగా ఆయన జపాన్​లో 'కల్కి 2898 ఏడీ' సినిమా ప్రమోషన్స్​కు వెళ్లడం లేదు. దీన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. 'నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ, మీరు నన్ను క్షమించాలి. సినిమా షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడం వల్ల అక్కడకు రాలేకపోతున్నాను' అని ప్రభాస్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. మారుతీ దర్శకత్వంలో ఆయన 'ది రాజా సాబ్‌' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హారర్‌ థ్రిల్లర్‌ జానర్​లో తెరకెక్కనుంది. ఈ చిత్రం చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది 2025 ఏప్రిల్‌ 10న వరల్డ్​వైడ్​గా విడుదల కానుంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ కనిపించని సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. దీనికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. హీరోయిన్​గా ఇమాన్వీ ఎస్మాయిల్‌ ఎంపికైంది. అలాగే ఆయన చేతిలో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్​లో 'సలార్‌2: శౌర్యంగపర్వం' (Salaar 2), సందీప్‌ వంగా 'స్పిరిట్‌' (Spirit Movie Prabhas) చేయాల్సి ఉంది. మరోవైపు 'కల్కి 2' (Kalki 2) కూడా ఉంది. అలా దాదాపు 5 భారీ ప్రాజెక్ట్​లతో ప్రభాస్ ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా లేనంత బిజీగా ఉన్నారు. ఇవన్నీ కూడా పాన్ఇండియా సినిమాలే కావడం విశేషం.

ఆ హీరోయిన్​తో కలిసి యూరప్​కు 'రాజాసాబ్' ప్రభాస్!

'రాజా సాబ్' స్పెషల్ సాంగ్! - 17 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోయిన్​తో ప్రభాస్ స్టెప్పులు!

ABOUT THE AUTHOR

...view details