తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

50 రోజుల తర్వాత సెట్స్​లోకి! - 'RT 75' షూటింగ్ ఎప్పుడు మొదలవ్వనుందంటే? - Raviteja 75 Movie New Schedule - RAVITEJA 75 MOVIE NEW SCHEDULE

Raviteja 75 Movie New Schedule : తన 75వ సినిమా షూటింగ్​లో గాయపడ్డ మాస్ మహారాజ రవితేజ త్వరలో మరోసారి సెట్స్​పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 'RT 75' కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలు కానుందంటే?

Raviteja 75 Movie New Schedule
Raviteja (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 5:16 PM IST

Raviteja 75 Movie New Schedule : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలె గాయం కారణంగా ఆయనకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అప్​కమింగ్ మూవీస్ షూటింగ్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తాజాగా ఓ అప్​డేట్​ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆయన త్వరలోనే మళ్లీ సెట్స్​లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

రవితేజ 75వ సినిమా కొత్త షెడ్యూల్ అప్పుడే!
ఇప్పటికే గాయం నుంచి కోలుకుంటున్న ఆయన మరో రెండు వారాల తర్వాత మళ్లీ షూటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల మాట. అక్టోబర్ 14 నుంచి RT 75వ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఆ షెడ్యూల్​లో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు మూడో వారంలో రవితేజకు గాయమవ్వగా, అదే నెల 24వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత మళ్లీ ఆయన సెట్స్​లోకి రానున్నారు. ఇది విన్న ఫ్యాన్స్ ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.

ఇక 'RT 75' సినిమా విషయానికి వస్తే, శ్రీ విష్ణు పాపులర్ మూవీ 'సామజవరగమన' రైటర్​ భాను భోగవరపు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్​గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో రవితేజ సరసన యంగ్ బ్యూటీ కథానాయిక శ్రీ లీల స్క్రీన్​పై కనిపించనుంది. 'ధమాకా' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్​లో రానున్న రెండో సినిమా ఇది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల మాట.

ఇదిలా ఉండగా, తాజాగా రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్​తో నడుస్తోంది. అయితే తొలి రోజు మాత్రం డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది. ప్రీమియర్స్ కలిపి దేశవ్యాప్తంగా రూ.5.3 కోట్ల నెట్​ కలెక్షన్ చెసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా ఇది. నటన పరంగా రవితేజ అదరగొట్టినప్పటికీ సినిమా ఆశించినస్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో పాటు బాక్సాఫీస్ ముందుకొచ్చిన రామ్, పూరి డబుల్ ఇస్మార్ట్ కూడా మిక్స్​డ్​ టాక్​తో సరిపెట్టుకుంది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతోనే వచ్చినప్పటికీ అభిమానులను మెప్పించలేకపోయాయి.

ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్ - 'వారందరికీ థ్యాంక్స్' - Raviteja Dishcarged

షూటింగ్​లో గాయపడ్డ హీరో రవితేజ - ఆరు వారాల పాటు రెస్ట్ - Hero Raviteja Injured

ABOUT THE AUTHOR

...view details