Rashmika New Hindi Movie Thama : సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుస చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తోంది హీరోయిన్ రష్మిక. గతేడాది యానిమల్‌తో హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో, వరుస షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది.
అయితే తాజాగా బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి సర్ప్రైజ్ చేసింది. 'స్త్రీ', 'బేడియా', 'ముంజ్య' క్రియేటర్స్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. భిన్న కాన్సెప్ట్‌తో ఇది రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి థమా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక తాజాగా పోస్ట్ కూడా పెట్టింది.