Rashmika Mandanna Japan Visit : పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాస్త గ్లోబల్ ఫేవరట్‌గా మారింది. ఆ సినిమాలో తన నటనకు మెచ్చిన ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ఫాలో అవ్వడం మొదలెట్టారు. సోషల్ మీడియాలోనూ తన పోస్ట్‌లకు లైక్స్ కొడుతూ, షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఇటీవలే రష్మికకు ఓ అరుదైన గౌరవం దక్కింది. 'క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్' వేడుకకుగానూ భారత్ తరపున పాల్గొనేందుకు ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు. అలా ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక మందన్న రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ ఈవెంట్ కోసం ఇటీవలే ఆమె జపాన్‌కు వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రష్మిక ఫొటోస్‌తో డిజైన్ చేసిన కొన్ని ఫ్లకార్డులు పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించారు. ఇదంతా చూసిన రష్మిక ఉప్పొంగిపోయారు. తనకు దక్కిన ఈ అభిమానం చూసి ఎమోషనలయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Rashmika Upcoming Movies : ఇక రష్మిక మూవీస్ విషయానికి వస్తే- రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ధనుశ్ నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న 'డీ 51' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు రెండూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక 'పుష్ప' ఈ ఏడాది ఆగస్ట్ 15 థియేటర్లలోకి రానుండగా, ధనుశ్ మూవీ మాత్రం తమ సినిమా టైటిల్‌తో పాటు ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండింటితో పాటు 'చిలసౌ' ఫేమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న 'ద గర్ల్‌ఫ్రెండ్' లో ఆమె లీడ్ రోల్ పోషిస్తోంది. టీజర్ చూస్తే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమాలా అనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమె లైనప్‌లో 'రెయిన్ బో' అనే సినిమా కూడా ఉంది.