Rashmika Mandanna Animal Movie : సందీప్ రెడ్డి వంగా డైరక్షన్లో వచ్చిన 'యానిమల్' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కమర్షియల్గానూ, కథ పరంగానూ మంచి సక్సెస్ సాధించింది ఈ మూవీ. ఇదంతా ఓ వైపు. మరోవైపు ఈ సినిమాలోని రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి విభిన్న కామెంట్లు వచ్చాయి. ఆ పాత్ర చిత్రీకరణ ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రణ్‌బీర్ ఇటువంటి పాత్రలో నటించి అభిమానులను అలానే చేయమని ప్రేరేపిస్తున్నారంటూ నెగిటివిటీ పాకింది.
అంతే కాకుండా సినిమాలోనే రణ్‌బీర్ ఇలా ఉన్నారంటే, సెట్స్‌లోనూ మిగతావారితోనూ ఇలాగే మర్యాద లేకుండా ఉంటారంటూ రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. దీంతో ఈ విషయంపై యానిమల్ హీరోయిన్, రష్మీక మందన్న స్పందించారు.
"రణ్‌బీర్ సెట్స్‌లో మహిళల పట్ల మర్యాద పూర్వకంగా మెలగడమే తనలో నాకు బాగా నచ్చే గుణం. నాకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, నేను చేయలేను అనిపించినా నేరుగా వెళ్లి ఆయనకు చెప్పేస్తాను. అదెలాంటిదైనా సరే, దానికి ఆయన 'అలా ఎలా నో చెప్తావ్ ప్రపంచంలో ఎలాంటి పనైనా నువ్వు చేయగలవు' అంటూ ధైర్యం చెప్తారు. అతని స్వభావం ఎలాంటిదంటే సెట్లోని మిగిలిన మహిళలతో కూడా అతను ఒకే మాట అంటుంటారు. లేడీస్ మీలో చాలా పవర్ ఉంది. వెళ్లండి మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి" అని ప్రోత్సహిస్తుంటారని పేర్కొంది.