తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

' షూటింగ్స్ కోసం రాత్రులు ప్రయాణించాలి - అందుకే సెలబ్రేట్​ చేసుకోలేకపోయా' - రష్మిక మందన్న లేటెస్ట్​ ఇంటర్వ్యూ

Rashmika Mandanna Animal Movie : యానిమల్ సినిమాలో కీలక పాత్ర పోషించిన రష్మిక మందన్న ఆ సినిమా సక్సెస్​ను సెలబ్రేట్​ చేసుకోవడం లేదంటూ పలు రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే రష్మిక తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 6:16 PM IST

Updated : Feb 25, 2024, 10:53 PM IST

Rashmika Mandanna Animal Movie :'పుష్ప' సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందింది యంగ్ బ్యూటీ రష్మిక మందన్న. ఈ సినిమాతో ఈ చిన్నది పాన్ ఇండియా లెవెల్​లో పాపులరైంది. అయితే ఇటీవలే వచ్చిన 'యానిమల్' మూవీతో ఈ అమ్మడు మరింత ఫేమస్ అయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్​ అందుకుని ఇటు టాలీవుడ్​ పాటు అటు బాలీవుడ్​లోనూ దూసుకెళ్లింది. దీంతో మూవీ టీమ్ మొత్తం ఈ సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకుంది.అయితే రష్మిక మాత్రం ఆ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకోలేదు. ఆమె ఇంటర్వ్యూలు, సినిమాకి సంబంధించి వేడుకల్లో పాల్గొకుండా పోవడం పట్ల పట్ల బాలీవుడ్‌లో చర్చ జరిగింది. అయితే వాటిపై రష్మిక సోషల్‌ మీడియా వేదికగా తాజాగా స్పందించింది.

"మేం (యానిమల్‌ టీమ్‌) తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్టును ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి నేను కూడా కొంత సమయం కేటాయించాలని అనుకున్నాను. కానీ, 'యానిమల్‌' రిలీజైన మరుసటి రోజే మరో సినిమా షూటింగ్​లో పాల్గొన్నాను. నాకు పని పట్ల ఎంత నిబద్ధత ఉందో మీరే అర్థం చేసుకోండి. అందుకే ఇంటర్వ్యూల్లోనూ సక్సెస్​ మీట్స్​లకు హాజరు కాలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్‌ కోసం కొన్ని సార్లు రాత్రుళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్‌ అవుతున్నారని నాకు బాగా తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు భర్తీ చేస్తాయని నేను భావిస్తున్నాను. అవి మిమ్మల్ని విశేషంగా అలరిస్తాయని అనుకుంటున్నాను. మీరు వాటిని చూస్తూ ఆనందించే చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్నిస్తుంది" అంటూ రష్మిక తెలిపింది.

Rashmika Upcoming Movies : ఇక రష్మిక ప్రస్తుతం లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న 'ఛావా' అనే సినిమాలో మెరిశారు. విక్కీ కౌశల్‌ సరసన ఆమె నటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌ సరసన 'పుష్ప 2'లో నటిస్తున్నారు రష్మిక. 'రెయిన్‌ బో', 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రాలతోనూ అలరించనున్నారు.

షాకింగ్ : చావు నుంచి తప్పించుకున్న రష్మిక - వామ్మో ఏం జరిగిందంటే?

'అలా అని మీకు ఎవరు చెప్పారు?'-నెటిజన్​పై రష్మిక ఫైర్​

Last Updated : Feb 25, 2024, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details