Rashmika Gift To Allu Arjun :నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా తాజాగా తన కో స్టార్ అల్లు అర్జున్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ఫ్రైజ్ చేశారు. ఈ విషయాన్ని బన్నీ తాజాగా తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రత్యేకమైన కానుక ఏంటంటే?
అమ్మ చెప్పిన అదృష్టం - అందుకే ఆ గిఫ్ట్
ఇక రష్మిక బన్నీ కోసం ఓ వెండి గిఫ్ట్ పంపించారట. దాంతో పాటు స్వీట్స్ కూడా సెండ్ చేశారట."వెండిని గిఫ్ట్‌గా ఇస్తే దాన్ని అందుకున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పారు. ఈ వెండి వస్తువు, అలానే దీంతో పాటు పంపించిన స్వీట్స్ తప్పకుండా మీకు మరెంతో లక్ అలాగే పాజిటివిటీ, ప్రేమను అందిస్తాయని ఆశిస్తున్నాను" అని రష్మిక ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు. దానికి "థాంక్యూ మై డియర్. ఇప్పుడు నాకు మరెంతో అదృష్టం కావాలి" అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.
ఇక "బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' తప్పకుండా రూల్ చేస్తుంది. మన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను కచ్చితంగా గుర్తిస్తారు. ఈ విషయంలో నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను" అని రష్మిక కూడా బన్నీకి రిప్లై ఇచ్చారు.