Double Ismart Teaser:ఎనర్జిటిక్ స్టార్ రామ్- సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ పూరి సోషల్ మీడియాలో ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా టీజర్ రిలీజ్ కానుంది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న డబుల్ ఇస్మార్ట్ అప్డేట్ వచ్చేసింది. 'ది మాక్కికిరికిరి' డబుల్ ఇస్మార్ట్ టీజర్ మే 15న రానుంది. రెడీగా ఉండండి' అని పూరి రాసుకొచ్చారు. దీంతో చాలా రోజుల తర్వాత సాలిడ్ అప్డేట్ రావడం రామ్ ఫ్యాన్స్‌లో జోష్ నిండినట్లైంది.
షూటింగ్ రీ స్టార్ట్: 2019లో బ్లాక్‌బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. తొలి భాగం సూపర్ హిట్ అవ్వడం వల్ల సీక్వెల్‌పై అందరకి అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కానీ, కొన్ని నెలల నుంచి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల మూవీ ఆగిపోయిందనుకున్నారంతా. కానీ, రీసెంట్గా సినిమా షూటింగ్ పునః ప్రారంభమైందని దర్శకుడు పూరి తెలిపారు. సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. 'మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పలు కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నాం' అని పూరీ ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో రామ్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.