Ram Charan Upasana Wedding Anniversary :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు తాజాగా తమ పెళ్లి రోజు వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం 2012 జరగ్గా, నిన్నటితో (జూన్ 14) వారు వివాహబంధంలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. అందులో చరణ్, ఉపాసనతో పాటు చిన్నారి క్లీంకార కూడా ఉంది. అంతే కాకుండా ఓ నోట్‌ను కూడా రాసుకొచ్చారు.
" మన బంధానికి అప్పుడే 12 వసంతాలు పూర్తయ్యాయంటే నమ్మలేక పోతున్నాను. నా మీద ఇంతటి ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్. మా జీవితాలు మరింత అందంగా మారడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అంటూ ఎమోషనలయ్యారు.