NBK Unstoppable Daaku Maharaaj Team : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ హోస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వేదికపై తన అప్‌కమింగ్ మూవీ 'డాకు మహారాజ్' కోసం ఓ స్పెషల్ ప్రోమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా 'అన్‌స్టాపబుల్'కు ఆ మూవీ టీమ్‌ను ఇన్వైట్ చేశారు. ఇక డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ తమదైన స్టైల్లో సందడి చేసి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
ప్రోమోలో హైలైట్స్ ఇవే :
ఇక ప్రోమోలో తమన్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి "ఫస్ట్ టైమ్ థియేటర్లలో స్పీకర్లు తగలబడిపోయింది మీ సినిమాకే" అంటూ బాలయ్యతో అంటారు. దానికి బాలయ్య "మీ స్పీకర్ల కెపాసిటీని పెంచుకో! డాకు మహారాజ్ వస్తోంది అంటూ సూపర్ రెస్పాన్స్ ఇస్తారు. ఇక "నీ గురించి చాలా విన్నాను. ఎన్నో ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నాను. నీకు అనుష్క అంటే చాలా ఇష్టం కదా?" అంటూ కాసేపు తమన్‌ను ఆటపట్టించారు బాలయ్య.
This season’s ultimate mass entertainment is here💥
— ahavideoin (@ahavideoIN) December 29, 2024
Daaku Maharaj team is here with mass talks and crazy moments, and endless fun#UnstoppableWithNBKS4 #Unstoppable #UnstoppableS4 #Aha #NandamuriBalakrishna @MusicThaman @dirbobby pic.twitter.com/CoP8y1c6KW
ఇదిలా ఉండగా, "నాకు అయితే రష్మిక అంటే ఇష్టం. తనకు పెళ్లి ఫిక్స్ అయినట్టు ఉంది కదా?" అని నిర్మాత నాగ వంశీని బాలయ్య అడగ్గా, దానికి "తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటున్నారని తెలుసు. కానీ ఎవరిని, ఎప్పుడు అనేది తెలీదు" అంటూ సమాధానం చెప్పారు నాగ వంశీ. ఇక "చెప్పమ్మా కొంచెం లీకులు ఇద్దాము" అంటూ బాలయ్య ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఇలా ప్రోమో మొత్తం ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతోనే సాగింది.
ఇక 'డాకు మహారాజ్' విషయానికి వస్తే సితారా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ దేఓల్తో పాటు రవి కిషన్ తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందినీ చౌదరీ, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 గ్రాండ్‌గా విడుదల కానుంది.
'Team Daaku' is here to kickstart 2025 with a bang! 🎉
— ahavideoin (@ahavideoIN) December 31, 2024
🔥 More Power, More Fun, More Action! 🔥 #UnstoppableWithNBK Season 4, Episode 8 Premieres Jan 3rd, 7PM! @ahavideoIN #UnstoppableWithNBKS4 #Unstoppable #UnstoppableS4 #Aha #NandamuriBalakrishna @MusicThaman @dirbobby pic.twitter.com/YMxyfUBfR2
'డాకు మహారాజ్' - మనసును హత్తుకునేలా 'చిన్నీ' సాంగ్
'డాకు మహారాజ్' కోసం మూడు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేశాం : నిర్మాత నాగవంశీ