Ram Charan Waves Summit 2025 : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్పందించారు. ఈ విషయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.
"ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రోత్సహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ సహకారానికి ఈ 'వేవ్స్ 2025' సమావేశం అసలైన గేమ్ ఛేంజర్ కానుంది" అంటూ చరణ్ పేర్కొన్నారు.
అసలు ఏంటీ ఈ వేవ్స్ సమ్మిట్ ?
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను 2025లో నిర్వహించునున్నట్టు ఇటీవల జరిగిన 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్‌లో ప్రధాని మోదీ తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రపంచ దేశాల మీడియా, వినోద రంగాల ప్రముఖులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికే ఓ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఈ వేవ్స్ సమ్మిట్‌పై పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.
Wonderful to see Honourable Prime Minister Shri. @narendramodi Ji and the Government of India supporting the Media & Entertainment sector.
— Ram Charan (@AlwaysRamCharan) December 31, 2024
The Film and Entertainment world summit, WAVES 2025, will be a true Game Changer for industry collaboration.
"అది ఓ అద్భుతమైన ఆలోచన, మీడియా, వినోద రంగాన్ని ప్రోత్సహించడం పట్ల ప్రధాని దార్శనికత అభినందించదగ్గది" - బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.
"ఆ వేడుకకు ప్రపంచం కలిసి రావడాన్ని చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" - బీటౌన్ సీనియర్ నటుడు అనిల్ కపూర్
ఇదిలా ఉండగా, సినీ పరిశ్రమలో 'వేవ్స్' మరో మైలురాయి అంటూ నటి ఖుష్బూ, హీరో సంజయ్ దత్, డైరెక్టర్ ఏక్తా కపూర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా మోదీని కొనియాడారు. ఇక 2025 ఫిబ్రవరి 5నుంచి 9 వరకు ఈ వేవ్స్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు దిల్లీ వేదిక కానుంది.
'తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ANR'
భారత చలనచిత్ర రంగానికి చెందిన నలుగురు దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాను మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దేశానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సినీ ప్రముఖుల శత జయంతి వేడుకలను 2024లో జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ దిగ్గజాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఏఎన్ఆర్ తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని మోదీ కొనియాడారు.
256 ఫీట్ల రామ్‌చరణ్ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!