Ram Charan Game Changer Movie :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన బాబాయ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు. 'గేమ్ ఛేంజర్'ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్‌తో దిగిన ఫొటోలను ఆయన తన ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.
"డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు మీ తనయుడు, నటుడు, భారత పౌరుడిగా నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాను. నా వెన్నంటే ఉండటూ, నాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు" అని పోస్ట్ పెట్టారు.
ఇక ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స సంబరపడిపోతున్నారు. బాబాయ్ అబ్బాయ్ ఒకే ఫ్రేమ్‌లో సూపర్‌గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట ఆ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు.
గ్రాండ్ ఈవెంట్!
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ పాల్గొని సందడి చేశారు. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చెర్రీ గురించి కూడా ఆయన ఈ వేదికపై మాట్లాడారు.
"రామ్‌చరణ్ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా తను నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా కాదు, ఓ అన్నగా ఆశీర్వదిస్తున్నా. లవ్ వ్యూ రామ్‌చరణ్. లవ్ వ్యూ ఆల్" అని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే, చెర్రీ, కియారా అడ్వాణీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కింది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమైంది ఈ చిత్రం. కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ ఈ సినిమాను పొందించారు. రామ్ చరణ్ ఇందులో రామ్‌నందన్, అప్పన్న అనే రెండు పాత్రల్లో నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే అప్పన్న పాత్ర సినిమాకు కీలకంగా ఉండనుందంటూ ఇప్పటికే టీమ్ వెల్లడించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది.
'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్‌కు కియారా దూరం! - ఆమెకు ఏమైందంటే?
'కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి'- గేమ్‌ఛేంజర్ ఈవెంట్లో పవన్