Ramcharan About Her Family : కొణిదెల వారసుడు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తనెవరికి భయపడతారో చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించే ఆయన తన ఇంట్లో ఒకరిని చూసి భయపడిపోతారట. ఆయనే భయపడతారంటే, కచ్చితంగా చిరంజీవిని చూసే అనుకుంటున్నారు కదా. అస్సలు కాదు. తన తండ్రి చిరంజీవికి, భార్య ఉపాసనకు లేదా చిన్నతనమంతా తనతో ఎక్కువగా గడిపిన బాబాయికి కూడా భయపడని చరణ్, ఎవరిని చూసి భయపడతారో తానే స్వయంగా చెప్పారు.
Ramcharan About Her Mother :"మా అమ్మ సురేఖ దగ్గరగా ఉన్నప్పుడు నాన్న కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. ఆమెనే మా ఇంటికి బాస్. నాకు, మా నాన్నకు, మా బాబాయికి కూడా బాస్ ఆమే. అమ్మ దగ్గరగా ఉన్నప్పుడు నాన్న జాగ్రత్తగా ఉండటం గమనించి నేను కూడా ఉపాసన దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసుకున్నా" అని చెప్పుకొచ్చారు చరణ్.
గతంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని చెప్పారు చరణ్. ఈ సినిమాలో చిరు - చరణ్, ఇద్దరూ కలిసి నటించారు. ఇలా నటించాలనే కోరిక కూడా తన తల్లి సురేఖదేనని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. అయితే చిరంజీవి సురేఖకు భయపడతారని, సురేఖ దగ్గరగా ఉంటే జాగ్రత్తగా ఉంటారని రామ్‌చరణ్ నోట విన్న చిరు - "ఈ విషయాలను నువ్వు నా దగ్గరి నుంచే నేర్చుకున్నావంటే, ఇక నువ్వు, ఉపాసన హ్యాపీగా బతికేయొచ్చు" అంటూ సరదాగా ఇదే ఈవెంట్‌లో బదులిచ్చారు.