తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

RC 16 బ్యాక్​డ్రాప్​ తెలిసిపోయిందోచ్చ్! - సినిమాటోగ్రాఫర్‌ అలా హింట్ ఇచ్చేశారుగా! - RC 16 SHOOTING UPDATE

శరవేగంగా RC 16 షూటింగ్​ - సినిమా బ్యాక్​డ్రాప్​ ఏంటంటే?

RC 16 Shooting Update
Ram Charan RC 16 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 12:41 PM IST

RC 16 Shooting Update :గ్లోబల్​ స్టార్ రామ్‌ చరణ్‌ లీడ్​ రోల్​లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మువీ 'ఆర్​సీ 16'. తాజాగా సెట్స్​లోకి వెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే గతంలోనే ఈ చిత్రం స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానున్నట్లు రూమర్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు పెట్టిన ఓ పోస్ట్‌ మూవీ లవర్స్​లో ఆసక్తిని పెంచుతోంది. ఇంతకీ అదేంటంటే?

తాజాగా 'ఆర్‌సీ 16' షూటింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు రత్నవేలు. అందులో షూటింగ్‌ చాలా ఫాస్ట్​గా జరుగుతున్నట్లు తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్​ ఫొటోను షేర్‌ చేశారు. అయితే, దానికి ఆయన పెట్టిన క్యాప్షన్స్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "నైట్‌ షూట్‌, ఫ్లడ్‌ లైట్స్‌, క్రికెట్‌ పవర్‌, డిఫరెంట్‌ యాంగిల్స్‌" అంటా ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్నిచూసి అభిమానులు ' సినిమా బ్యాక్​డ్రాప్​ తెలిసిపోయిందిగా' అని కామెంట్ చేస్తున్నారు

ఆ టెక్నాలజీ కూడా
మరోవైపు ఈ సినిమాలో ఓ సీక్వెన్స్‌ కోసం నెగిటివ్‌ రీల్‌ వినియోగించున్నట్టు రత్నవేలు తెలిపారు. 'ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్‌ అయ్యింది. కానీ, హాలీవుడ్‌లో మళ్లీ నెగిటివ్‌ ఉపయోగించి సినిమా షూట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నెగిటివ్‌ రీల్‌తో షూటింగ్‌ చేయడం అంత ఈజీ పని కాదు. డిజిటల్‌ కెమెరాలతో షూటింగ్‌ చేస్తుంటే, నటులు ఎన్ని టేక్స్‌ తీసుకున్నా సమస్య ఉండదు. అదే నెగిటివ్‌ ఉండే కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం' అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సన్నివేశం పూర్తిగా నేచురల్​గా ఉండేదుకు ఇలా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, రీసెంట్ బ్లాక్​బస్టర్ 'దేవర' సినిమాకు కొంత మేర ఆ ప్రయత్నం చేశానని రత్నవేలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ఫీమేల్​ లీడ్​గా నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మ్యూజికల్​ సెన్సేషన్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలతో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'RC 16' సెట్స్​లోకి రామ్‌ చరణ్‌! - ఆ స్టార్స్​తో నయా షెడ్యూల్​ - షూటింగ్ ఎప్పుడంటే?

చెర్రి ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- RC16 అప్డేట్- ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details