RC 16 Update :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'RC 16' (వర్కింగ్ టైటిల్). యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు పీరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్టేట్ బయటకొచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన అనేక కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో దిల్లీలో జరగనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్లో రెజ్లింగ్‌కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆలాగే ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. చరణ్ సినిమా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలవుతుందని సంబరపడుతున్నారు.
పక్కా బ్లాక్ బస్టర్!
రీసెంట్గా ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రామ్‌చరణ్‌తో తాను తెరకెక్కిస్తున్న సినిమా గురించి దర్శకుడు బచ్చిబాబు కీలక కామెంట్లు చేశారు. ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 'ఉప్పెన సినిమాకు మా నాన్న థియేటర్ బయట నిలబడి రివ్యూలు అడిగారు. అయితే ఈ సినిమాకు అలా రివ్యూలు అడగాల్సిన పని లేదు. అది పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని అన్నారు. దీంతో అభిమానుల్లో RC16పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.