Ram Charan Birthday :'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కేవలం చిరంజీవి కొడుకు అయినందుకే ఈ క్రేజ్ అని విమర్శించే వారు కూడా ఇప్పుడు చరణ్ పవర్ ప్యాక్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిపోయారు. కేవలం నటనలోనే కాదు డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకుల మనసుల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడీ హీరో. అయితే నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.
మెగాస్టార్ చిరంజీవికి పరిశ్రమలో ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలిసిందే. మరి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన స్టార్ హీరో కొడుకు ఇండస్ట్రీకి వస్తున్నాడంటే ఎన్ని ఎక్స్‌పెక్టేషన్లు, ఎన్ని ఊహాగానాలు వ్యక్తమవుతాయో. వాటిల్లో ఏ ఒక్కటీ తీసిపోకుండా అంతకుమించే సాధించారు చరణ్. అందరూ అనుకున్నట్లు చరణ్‌కు చిరంజీవి ఇవన్నీ దగ్గరుండి నేర్పించలేదు. పోనీ సినిమా సెట్లకు తీసుకెళ్లి అందరితో పాటు కూర్చోబెట్టి సినీ ప్రపంచాన్ని చూపించలేదు. చెర్రీ లైఫ్‌లో మరో యాంగిల్ ఏంటంటే ఒక డిసిప్లైన్‌డ్ ఫాదర్, సినిమా మ్యాగజైన్లు కూడా ఫాలో అవ్వొద్దని కండిషన్లు, బైక్ డ్రైవ్ చేయొద్దని ఆంక్షలు వీటి నడుమ పెరిగాడు చెర్రీ.
అదంటే భయమట : పదో తరగతి వరకు కండీషన్స్‌తో పెరిగిన చరణ్‌కు ఆ తర్వాత కాస్త ఫ్రీడమ్ దొరికిందట. అయితే అందరి కుర్రాళ్లలాగా బైక్స్ మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోలేదు చెర్రీ. వాస్తవానికి మొదట్లో బైక్ రైడ్స్ అంటే భయపడేవారట. బైక్ వద్దని చెబితే హార్స్ రైడింగ్ మీద ఇష్టం పెంచుకున్నారట. ఆ తర్వాత బైక్ ఫార్మాలటీగా నేర్చుకున్నారట. ఎక్కువగా చిన్ననాటి నుంచి పెట్స్ మీద చాలా ఇష్టం పెంచుకున్నారు చెర్రీ. ఇకపోతే ఆయనకు చిన్నప్పటి నుంచి పార్టీలలో డ్యాన్స్ వేయడమనేది ఎప్పుడూ అలవాటు లేదు. అసలు మొదట్లో సినిమాలంటేనే పెద్దగా ఆసక్తి లేని చెర్రీ తండ్రి కోరిక మేరకు సడెన్‌గా యాక్టింగ్ వైపునకు మళ్లడం, ఒకొక్కటిగా లోపాలను దాటుకుంటూ రంగస్థలం లాంటి సవాల్ విసిరే హీరో పాత్రను కూడా పర్ఫెక్ట్గా పండించే స్థాయికి ఎదిగారు.