తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆత్మవిశ్వాసం కలిగిన మహిళగా కనిపిస్తా - నా కెరీర్​లో ఇదే బెస్ట్ మూవీ' - INDIAN 2 - INDIAN 2

Rakul Preet Singh In Indian 2 : కమల్​ హాసన్ కీలక పాత్రలో రూపొందిన 'భారతీయుడు 2' చిత్రం జులై 12న విడుదల కానుంది. ఈ నేపథ్యం జరగుతున్న ప్రమోషనల్ ఈవెంట్స్​లో మూవీ టీమ్ సందడి చేస్తోంది. అలా ఈ సినిమాలో తనది ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ విశేషాలు మీ కోసం.

Rakul Preet Singh In Indian 2
Rakul Preet Singh In Indian 2 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 3:51 PM IST

Rakul Preet Singh In Indian 2 : కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భారతీయుడు 2'. ఇందులో సిద్ధార్ధ్​, కాజల్​, ప్రియా భవానీ శంకర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో నటించగా, బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ స్ట్రాంగ్ రోల్​లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన రోల్​ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

'నా కెరీర్‌లోని బెస్ట్‌ సినిమాల్లో 'ఇండియన్‌-2' ఒకటి. ఎందుకంటే ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గర పోలికలతో ఉంటుంది. ఇందులోని నా పాత్ర ఓ గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన మహిళగా ఉండనుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నేనెప్పుడూ నటించలేదు. ఈ మూవీ షూటింగ్ మొత్తం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్‌ వంటి గొప్ప డైరెక్టర్​తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా గురించి మీతో చాలా విషయాలు పంచుకోవాలని ఆసక్తిగా ఉంది. దానికి ఇంకా సమయం పడుతుంది' అని రకుల్ తెలిపింది.

ఇక 'ఇండియన్​ 2' సినిమా విషయానికొస్తే జులై 12న ఈ చిత్రం వరల్డ్​ వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. 1996లో శంకర్‌ డైరెక్షన్​లో వచ్చిన 'బారతీయుడు' సంచలనం సృష్టించింది. సేనాపతి పాత్రలో కమల్‌ ఆహార్యం, నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'భారతీయుడు 2' మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇది విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు.

'భారతీయుడు2'లో మనీషా కొయిరాల?
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మనీషా కొయిరాల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్‌తో ఆమె దిగిన ఫొటో వైరల్‌ కావడం వల్లే మనీషా నటించారని టాక్‌ వినిపిస్తోంది. ఇక ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్- రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

ఐఏఎస్‌ పదవి వదిలి చేసి సినిమాల్లోకి ఎంట్రీ - తొలి చిత్రం ఏమైందంటే? - Musical School Director Debut Movie

క్రైమ్ థ్రిల్లర్​ 'మీర్జాపూర్‌ 3' వచ్చేస్తుందోచ్​ - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

ABOUT THE AUTHOR

...view details