Rajinikanth New Movie with Mari Selvaraj : సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాల విషయంలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో జోరు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ దసరా పండక్కి 'వేట్టయాన్' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ'తో రానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
మరోవైపు జైలర్ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త కథ విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఓ యువ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయట. ఆయన మరెవరో కాదు 'కర్ణన్', 'మామన్నన్' చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించిన దర్శకుడు మారి సెల్వరాజ్.
మారి సెల్వరాజ్ ప్రస్తుతం రజనీ కాంత్‌తో ఓ మూవీ చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నారట. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా ఆయనే చెప్పారు. "రజనీ కాంత్‌కు నేను అంటే ఇష్టం. నా గత చిత్రాలు 'కర్ణన్', 'మామన్నన్' చూశారు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కథా చర్చలు జరుగుతున్నాయి" అని తెలిపారు మారి సెల్వరాజ్.
ప్రస్తుతం మారి సెల్వరాజ్ తెరకెక్కించిన 'వాజై' చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో సినిమా 'బైసన్' 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.