తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమెడియన్​గా మారిన 'పుష్ప' షెకావత్ సార్ - Fahad fazil - FAHAD FAZIL

Rajinikanth 170th Movie Fahad fazil : పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్​గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో భయపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఫహద్ ఫాజిల్. అయితే ఇప్పుడాయన కమెడియన్​గా మారారు. పూర్తి వివరాలు స్టోరీలో

కమెడియన్​గా మారిన పుష్ప విలన్​!
కమెడియన్​గా మారిన పుష్ప విలన్​!

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 3:20 PM IST

Rajinikanth 170th Movie Fahad fazil : అబ్దుల్‌ హమీద్‌ మహమ్మద్‌ ఫహాద్‌ ఫాజిల్‌ - ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అందులోనే ఉన్న ఫహాద్‌ ఫాజిల్ మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన మలయాళ స్టార్, విలక్షణ నటుడు నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చకున్నారో తెలిసిన విషయమే. పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్​గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో భయపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోలీవుడ్‌, టాలీవుడ్‌లో విలన్‌గా గుర్తింపు పొందారు. ఆ మధ్య తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌, కీర్తీ సురేశ్​ జంటగా నటించిన మామన్నన్‌ చిత్రంలో విలనిజాన్ని పండించి అదరగొట్టేశారు. ఇక కమల్‌ హాసన్‌ విక్రమ్‌లో రా ఏజెంట్​గా కీలక పాత్రలో నటించి మెప్పించారు.

ఇప్పుడాయన కోలీవుడ్​లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్‌ చిత్రంలోనూ యాక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇందులో తన పాత్ర గురించి మాట్లాడారు ఫహద్ ఫాజిల్. వేట్టైయాన్‌ సినిమాలో దర్శకుడు జ్ఞానవేల్‌ తనను కమెడియన్‌గా మార్చారని చెప్పకొచ్చారు. వెట్టేయాన్ సినిమాను నన్ను కమెడియన్ చేశారు. కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాలో నన్నే చాలా మందిగా హీరోగా అనుకున్నారు. అంతటి కీలక పాత్రలో నటించిన నేను వేట్టైయాన్‌ చిత్రంలో కమెడియన్‌గా చేస్తున్నాను. ఇది నన్ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అని ఫహద్​ ఫాజిల్ పేర్కొన్నారు.

కాగా ఈ సినిమా అక్టోబర్‌ నెలలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జైలర్‌ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఇందులో నటిస్తున్నారు రజనీకాంత్. రజనీ 170వ చిత్రంగా ఇది రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రజనీ కాంత్​ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. శర్వానంద్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. జైభీమ్‌ లాంటి విజయం తర్వాత జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సమంత సైలెంట్ బ్లాస్ట్ - సోషల్ మీడియా షేక్​! - Samantha Upcoming Movies

ఆ ఫోటో నిజం కాదు - విజయ్ దేవరకొండ - Family Star Negative Trolling

ABOUT THE AUTHOR

...view details