SSMB 29 Release Date :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గత ఏడాది గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించేలా వసూలు చేసింది.
అయితే మహేశ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరో వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారం సాగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం రూ.100 కోట్లతో భారీ సెట్ వేయనున్నట్లు కథనాలు కనిపిస్తున్నాయి. అలానే చిత్రాన్ని 2027లో గ్రాండ్గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కాగా, ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది.