తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇది కూడా ఓ అప్‌డేటేనా?' అని అంటున్నారు' - 'రాజా సాబ్' డైరెక్టర్ స్పీచ్​ - డైరెక్టర్ మారుతి లేటెస్ట స్పీచ్​

Raja Saab Director Maruti Speech : ఇటీవలే రాజా సాబ్​ సినిమా గురించి ఆ మూవీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌ ప్రారంభమైన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనలయ్యారు.

True Lover Trailer Release Event
True Lover Trailer Release Event

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 10:42 PM IST

Raja Saab Director Maruti Speech :రెబల్ స్టార్ప్రభాస్​తో తాను సినిమా చేయడం ఓ అచీవ్‌మెంట్‌ అంటూ డైరెక్టర్​ మారుతి తాజాగా వ్యాఖ్యనించారు. తన కెరీర్‌ ప్రారంభమైన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనలయ్యారు. 'ట్రూ లవర్' మూవీ ట్రైలర్‌ రిలీజ్​ ఈవెంట్​కు హాజరమైన మారుతి ఈ సందర్భంగా 'రాజాసాబ్' మూవీ గురించి మాట్లాడారు.

"ట్రూ లవర్‌ చిత్రం నేను తెరకెక్కించిన 'ఈ రోజుల్లో' సినిమా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. తక్కువ బడ్జెట్‌తో నేను ఆ మూవీని రూపొందించాను. ఆ తర్వాత 'బస్‌స్టాప్‌', తదితర సినిమాలను తీశాను. అలా నెమ్మదిగా ప్రారంభమైన నా జర్నీ ఇప్పుడు ప్రభాస్‌ వరకు వచ్చింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 'రాజా సాబ్‌' గురించి నేను మాటల్లో చెప్పను. చేతల్లోనే చూపిస్తా. ఈ సినిమాకు సంబంధించి నెలకో అప్‌డేట్‌ ఉంటుందని మేము ఇటీవల చెప్పాం. ఆ మేరకు ఏదో ఒకటి ఇస్తే 'ఇది కూడా ఓ అప్‌డేటేనా?' అని మళ్లీ మీరే అంటున్నారు. అందుకే మంచి సర్‌ప్రైజ్‌ కోసం వెయిట్​ చేయండి. లవ్​లో ఫెయిల్​ అయ్యిన ఓ అబ్బాయి బాధ ఎలా ఉంటుందో 'ట్రూ లవర్'లో చూపించబోతున్నారు. ఈ మూవీ డైరెక్టర్​ ఆరేళ్లు కష్టపడి ఈ కథను రాశారట. ఇలాంటి మంచి కథలను అందించేందుకు నన్ను, ప్రొడ్యూసర్​ ఎస్‌.కె.ఎన్‌ను సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను" అని మారుతి మాట్లాడారు.

గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో 'రాజా సాబ్‌' విడుదలపై డైరెక్టర్ మారుతి కీలక వ్యాఖ్యలు చేశారు. 'త్వరలోనే ప్రభాస్‌ నటించిన పెద్ద సినిమా రిలీజ్‌ కానుంది. దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ రావాలి. ఆ మూవీ మంచి విజయం సాధించాలి. అందరూ కోరుకునే మంచి తేదీకే 'రాజా సాబ్‌'ను రిలీజ్‌ చేస్తాం. నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌ని. ప్రస్తుతం ఆయన ప్రేమని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఆయనంటే నాకెంత ఇష్టమో సినిమాలోనూ కనిపిస్తుంది' అని అన్నారు.

True Love Movie Cast : ఇక ట్రూలవర్​ సినిమా విషయానికి వస్తే - గుడ్​ నైట్ ఫేమ్​ కోలీవుడ్ నటుడు మణికందన్‌, శ్రీగౌరి ప్రియ ఈ సినిమాలో జంటగా నటించారు. డైరెక్టర్ ప్రభురామ్‌ వ్యాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 9న తమిళంలో, 10న తెలుగులో విడుదల కానుంది.

'రాజాసాబ్' అప్డేట్స్​ అందుకే రావట్లేదు!: డైరెక్టర్ మారుతి

'ఇప్పటివరకు డైనోసార్, ఇక డార్లింగ్- ప్రభాస్​ ఫ్యాన్స్ గెట్​ రెడీ !'

ABOUT THE AUTHOR

...view details