Pushpa 2 Pre Booking Record : ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే పలు రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తోంది 'పుష్ప ది రూల్'. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.
ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్‌లో జోరు చూపించిన ఈ సినిమా తాజాగా నార్త్‌లోనూ ఓ రేంజ్లో అమ్ముడువుతున్నాయని సినీ వర్గాల మాట. హిందీ వెర్షన్‌లో టికెట్స్ ఓపెన్ చేయగా, నిమిషాల్లోనే టికెట్లన్నీ బుక్ స్పీడ్‌గా బుక్ అవుతున్నాయట. ఈ క్రమంలో అక్కడ 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్ సేల్ అయ్యాయట.
అయితే ఈ బుకింగ్స్‌తో 'పుష్ప 2' ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే బీటౌన్‌లో రికార్డులు సృష్టించిన టైగర్3 (65,000), యానిమల్ (52,500), డంకీ (42,000), స్త్రీ 2 (41,000) సినిమాలను 'పుష్ప2' బీట్ చేసింది. అలా బాలీవుడ్‌లో ఆల్ టైమ్ టాప్ సినిమాల లిస్ట్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.