తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమ్మోరు గెటప్​లో బన్నీ విశ్వరూపం - గంగమ్మ జాతరలో ఒక్కొక్కరికి పూనకాలే! - Pushpa 2 Teaser - PUSHPA 2 TEASER

Pushpa 2 Teaser : నేడు(ఏప్రిల్ 8) అల్లు అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ చెప్పినట్టుగానే టీజర్​ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా సాగింది.

Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 11:16 AM IST

Updated : Apr 8, 2024, 11:27 AM IST

Pushpa 2 Teaser :అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ పుష్ప 2 నుంచి టీజర్ వచ్చేసింది. నేడు(ఏప్రిల్ 8) ఆయన పుట్టిన రోజు(Happy birthday alluarjun) సందర్భంగా ముందుగా చెప్పినట్లే ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసి ఫ్యాన్స్​లో జోష్ నింపారు మేకర్స్. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ ఎంత పవర్​ ఫుల్​గా అయితే సాగింతో ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం కూడా ఆద్యంతం అంతకుమించి పవర్​ ఫుల్​గా సాగింది.

నిమిషం ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్​ కాళీ అమ్మవారి వేషంలో యాక్షన్ అదరగొట్టేశారు. గంగమ్మ జాతరలో తన పుష్ప మేనరిజాన్ని చూపిస్తూ విలన్లపై విరుచుపడ్డారు. చీర కొంగు నడుముకు చుట్టుకుని ఊచకోత కోస్తూ కనిపించారు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ మోత మోగించేసింది. ఇక ప్రచార చిత్రంలో చివర్లో గుండాల మీదకి అల్లు అర్జున్​ వెళ్లే సీన్ అయితే హైలైట్​గా నిలిచింది. డైలాగ్‌ మాత్రం ఒక్కటి లేదు. అయినా కూడా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే పాత రికార్డులు తిరగరాసి, బాక్సాఫీస్ ముందు గంగమ్మ జాతర జరిపించేందుకు పుష్పగాడు సిద్ధంగా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పుష్పగాడు సిండికేట్‌ అయ్యాక అతడి రేంజే పెరిగినట్టు తొలి భాగంలోనే అర్థమవుతోంది. ఇక రీసెంట్​గా రిలీజ్ చేసిన పోస్టర్​లోనూ శ్రీవల్లి ఒంటినిండా నగలతో ధగధగ మెరిసిపోతూ కనిపించింది. టీజర్​లో కనిపించలేదు.

కాగా, మొదటి భాగం విషయానికొస్తే అన్నట్టుగా పుష్ప ఫ్లవర్‌ కాదు - ఫైర్​ అని ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు పుష్ప రాజ్. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్​ను షేక్ చేశాడు. పలు భాషల్ని, ప్రాంతాల్ని ఏకం చేశాడు. నేషనల్​ బెస్ట్​ యాక్టర్​గా అల్లు అర్జున్‌ను టాలీవుడ్ అగ్రస్థానంపై నిలబెట్టాడు. అలాగే తెలుగు సినిమాకే అరుదైన గౌరవం లభించేలా చేశాడు. దీంతో రెండో భాగం ది రూల్​పై ఆకాశమే హద్దుగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ ఎక్కడా రాజీపడకుండా​ సినిమాను భారీగా తీర్చిదిద్దుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​ అని బయట ప్రచారం సాగుతోంది.

Pushpa 2 Release Date : ఈ పుష్ప పాత్రతో బన్నీ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. అల్లు అర్జున్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక నటించింది. ఇంకా సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్‌, అనసూయ సహా పలువురు కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తొలి భాగానికి మించి మ్యూజిక్ ఉంటుందని, సౌండ్​లు బద్దలైపోతాయని మూవీటీమ్ ప్రచారం చేస్తోంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ - రామకృష్ణ, మోనిక నిగొత్రే, పాటలు - చంద్రబోస్‌, ఛాయాగ్రహణం - మిరోస్లా క్యూబా బ్రోజెక్‌. మరి ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్​ ఎలాంటి హంగామా చేస్తాడో తెలియాలంటే ఆగస్టు 15 వరకూ ఎదురు చూడాల్సిందే.

బన్నీకి మాత్రమే సాధ్యమైన రికార్డులివే - అన్నింటిలోనూ నెం.1! - HAPPY BIRTHDAY ALLUARJUN

బర్త్​డే బాయ్ బన్నీ ఫిట్​నెస్, డైట్​ సీక్రెట్​ ఇదే - Happy Birthday Allu Arjun

Last Updated : Apr 8, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details