తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మాటిస్తున్నా, ఇకపై అలా చేస్తా' : ప్రభాస్​ బాటలోనే అల్లు అర్జున్​! - PUSHPA 2 PROMOTIONS

'పుష్ప 2' ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీ టీమ్​ - ఫ్యాన్స్​కు మాటిచ్చిన అల్లు అర్జున్.

Prabhas Pushpa 2 Allu arjun
Prabhas Pushpa 2 Allu arjun (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 6:38 AM IST

Pushpa 2 Movie Allu Arjun : 'పుష్ప 2' చిత్రంతో బాక్సాఫీస్​ను రూల్ చేసేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. మరో వారం రోజుల్లో (డిసెంబర్ 5) థియేటర్లలో సందడి చేయనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్​ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్​తో నిర్మించింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్​లో జోరు పెంచింది చిత్ర బృందం. అల్లు అర్జున్​ వరుసగా ఈవెంట్స్​లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేరళలోని కొచ్చిలో ఈ చిత్ర ప్రచార వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలో హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ - "ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. గత మూడేళ్లుగా ఈ చిత్రంతోనే ప్రయాణం చేస్తున్నాను. ఇందులో నాకు, ఫహాద్‌ ఫాజిల్‌ మధ్య వచ్చే సన్నీవేశాలు ప్రతి ఒక్కర్నీ బాగా అలరిస్తాయి. ముఖ్యంగా ఫహాద్‌ యాక్టింగ్ మలయాళ ఆడియెన్స్​ను గర్వపడేలా చేస్తుంది. 20 ఏళ్లుగా నాపై ప్రేమను కురిపిస్తున్న మలయాళ ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో పుష్ప 2లో ఓ సాంగ్​ను మలయాళ లిరిక్స్‌తో ప్రారంభమయ్యేలా రెడీ చేశాం. అది అన్ని భాషల్లోనూ అదే లిరిక్‌తోనే ఉంటుంది. ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను" అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్​ రష్మిక, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు హీరో ప్రభాస్​ కూడా ఇలానే మాటిచ్చారు. బాహుబలి నుంచి ఆదిపురుష్ వరకు బాగా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేశారు. అయితే సలార్, కల్కి 2898ఏడీ విజయాలు తర్వాత ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని, ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో పలకరిస్తారని మాటిచ్చారు. ఇప్పుడు ప్రభాస్ తరహాలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప కోసం బాగా గ్యాప్​ తీసుకోవడంతో, ఇకపై వరుస చిత్రాలతో మెప్పిస్తానని ఫ్యాన్స్​కు మాటిచ్చారు.

ఆ విషయంలో షారుక్​ను వెనక్కి నెట్టిన బన్నీ! - అంతా 'పుష్ప' ఎఫెక్టే!

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత

ABOUT THE AUTHOR

...view details