Pushpa 2 Fahadh Faasil :ఈ రోజుల్లో సినిమాకి హద్దులు చెరిగిపోయాయి. అందరూ అన్ని భాషల సినిమాలను చూస్తున్నారు. చాలా మంది హీరోలు స్థానిక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్ తన విలక్షణ నటనతో అన్ని భాషల్లో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఫాజిల్ తన లేటెస్ట్ మూవీ ఆవేశంకు వస్తున్న రెస్పాన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన ఓ షోలో మాట్లాడుతూ సినిమా గురించి చేసిన కామెంట్స్‌కు ఫ్యాన్స్ నుంచి మిక్స్‌డ్ రియాక్షన్లు వస్తున్నాయి.
సినిమాను సీరియస్‌గా తీసుకోవద్దు - "జీవితంలో సినిమాల కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని చెప్పారు ఫాజిల్. ‘నేను ఎప్పుడూ నా ఫ్యాన్స్‌కు ఓ విషయం చెబుతాను. వారిపై నాకున్న కమిట్‌మెంట్ ఎంతవరకంటే, సినిమా చూడగలిగేలా తీసేందుకు ప్రయత్నిస్తాను. అంతకు మించి వారు నా గురించి ఆలోచించాలని నేను కోరుకోను. నా జీవితంతో నేను ఏం చేస్తున్నాను? వంటి విషయాలు అనవసరం. మీరు సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను సీరియస్‌గా తీసుకోకండి. మీరు థియేటర్లలో ఉన్నప్పుడు మాత్రమే నా గురించి ఆలోచించండి. యాక్టర్‌లు, పెర్ఫార్మెన్స్‌లు గురించి డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్‌లు పెట్టకండి. థియేటర్‌లో లేదా ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో మాత్రమే మాట్లాడండి. అంతకు మించి సినిమాకు మీ జీవితంలో ప్రాధాన్యం ఇవ్వద్దు. సినిమా చూడటం కంటే మీ జీవితంలో మీరు చేయాల్సింది చాలా ఉంది." అని అన్నారు.
- మిక్స్‌డ్ కామెంట్స్ -ఫాజిల్ చేసిన ఈ కామెంట్స్‌కు సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్లు వస్తున్నాయి. కొందరు అతని సలహాతో ఏకీభవిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆయన సినిమాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల తనకు తానే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నాడని కామెంట్స్ చేశారు. కాగా త్వరలోనే ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో IPS భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించనున్నారు.