Producer SKN Alluarjun Pushpa 2 : దర్శకుడు సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో 'పుష్ప 2' భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాతో పాటు బన్నీపై నిర్మాత ఎస్‌కెఎన్ కీలక కామెంట్స్ చేశారు. పుష్ప 2 సినిమాను చూసి అందరూ ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు.
ఎస్‌కెఎన్ మాట్లాడుతూ - "లోకల్ వెబ్‌సైట్స్ అల్లు అర్జున్ స్టామినా అర్థం చేసుకోవట్లేదు అని ఆ మధ్య పోస్ట్ పెట్టాను. ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు నేను అలా రిప్లై ఇచ్చాను. కరోనా సమయంలో ఏ ప్రమోషన్ లేకుండానే పుష్పను రిలీజ్ చేసి రూ.100 కోట్లు వసూళ్లు చేసిన హీరో ఆయన. తెలుగు సినిమా ఖ్యాతిని పుష్ప చిత్రం నిలబెట్టింది. ఇప్పటి వరకు ఏ హీరో సాధించలేని జాతీయ అవార్డును బన్నీ అందుకున్నారు. రీసెంట్గా నేను ఫారెన్‌కు వెళ్తే అక్కడ చాలా మంది పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా రీచ్‌ను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేశాను." అని చెప్పుకొచ్చారు.
'పుష్ప 2లో ఏమైనా సన్నివేశాలు చూశారా?' అని అడిగిన ఓ ప్రశ్నకు ఎస్‌కెఎన్ స్పందించారు. "వారం క్రితం అల్లు అర్జున్ డబ్బింగ్ చెబుతుంటే రెండు సీన్స్ చూశాను. 70 ఏళ్లలో తెలుగులో ఎవరికీ రాని జాతీయ అవార్డు అల్లు అర్జున్‌కు దక్కింది. పుష్ప 2 తర్వాత ఏడేళ్లలో భారత్‌లో ఉన్న అన్ని అవార్డులు ఆయన అందుకుంటారు అని నాకు అనిపించింది. సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఈ చిత్రం మరో లెవల్‌కు కచ్చితంగా తీసుకెళ్తుంది. " అని అన్నారు.