తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య సీట్ దగ్గర మద్యం సీసా - అసలు విషయం చెప్పిన నిర్మాత నాగవంశీ - Viswak Sen Gangs Of Godavari - VISWAK SEN GANGS OF GODAVARI

Gangs Of Godavari Balakrishna Alcohol : విశ్వక్‌ సేన్‌ యాక్షన్‌ డ్రామా గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ వేడుకలో బాలయ్య పక్కన్న ఉన్న మందు బాటిల్, అలాగే హీరోయిన్ అంజలిని నెట్టడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్ సేన్​తో పాటు నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.

Source ETV Bharat
balakrishna (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 4:42 PM IST

Gangs Of Godavari Balakrishna Alcohol :విశ్వక్ సేన్ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్‌ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ విచ్చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే ఈవెంట్‌లో బాలయ్య కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్‌ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. "అవన్నీ సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)లో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం. ఈవెంట్‌ నిర్వహించడంతో పాటు ఈవెంట్​ పూర్తయ్యేవరకు నేను అక్కడే ఉన్నాను. అసలు అక్కడ అలాంటి బాటిల్‌ ఏదీ లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో కావాలనే అనవసర చర్చ చేస్తున్నారు తప్ప అక్కడ జరిగిందీ ఏమీ లేద"న్నారు. ఈ విషయంపై హీరో విశ్వక్‌ సేన్‌ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వీడియోను సీజేలో క్రియేట్‌ చేసిన వ్యక్తి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి-2 కోసం పని చేయబోతున్నాడని కాస్త చురకలు కూడా అంటించారు.

Balakrishna Anjali : ఇక ఇదే ఈవెంట్​లో స్టేజ్​పై నటి అంజలిని బాలకృష్ణ చేతితో నెట్టడంపైన కూడా బాగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై కూడా నాగవంశీ రియాక్ట్ అయ్యారు. "ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య అంజలినీ కోరారు. చనువుకొద్దీ అలా చేశారు. తమకున్న పరిచయం, చనువును ఆధారంగా ఎవరైనా అలా చేస్తారు. అయినా ఆ చర్యకు ముందూ, వెనక ఉన్న పూర్తి వీడియోను ఎవరూ చూడకుండా ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయొద్దు. అలా ప్రచారం చేయడం సరి కాదు" అని అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హై ఫై చేసుకున్న సీన్​ను ఎవరూ చూపించలేదన్నారు.

స్పెషల్‌ షోలు కుదరదు - మీడియా కోసం ప్రత్యేకంగా షోలు వేయాల్సిన అవసరం లేదని అన్నారు నిర్మాత నాగవంశీ. రివ్యూ కోసమైతే టికెట్‌ కొనుక్కొని సినిమా చూసి రాయాలని చెప్పారు. మీడియా వాళ్లు కూడా తమ ఫ్యామిలీలతో కలిసి సినిమా చూడాలనే ఉద్దేశంతో స్పెషల్‌ షో వేయడం లేదని వివరణ ఇచ్చారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇదే చెప్పారు.

వాళ్లను ఇన్సిపిరేషన్​గా తీసుకో మోక్షు- నేను విశ్వక్ ట్విన్స్​లానే ఉంటాం: బాలయ్య - Nandamuri Mokshagna Inspiration

ABOUT THE AUTHOR

...view details