తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కంగువా', 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్స్​ - థియేటర్లలోకి అప్పుడే - Vikram Thangalaan Movie

Kanguva Thangalaan Release Date : 'కంగువా', 'తంగలాన్‌' సినిమాల విడుదల తేదీలను ఉద్దేశించి స్టూడియో గ్రీన్‌ నిర్మాత ధనంజయన్‌ మాట్లాడారు. వాటిపై ఓ క్లారిటీ ఇచ్చారు.

'కంగువా', 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్స్​ - థియేటర్లలోకి అప్పుడే
'కంగువా', 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్స్​ - థియేటర్లలోకి అప్పుడే

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 3:11 PM IST

Kanguva Release Date : కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్​ డేట్​పై నిర్మాత ధనంజయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని అన్నారు. "సినిమా పూర్తి కాకముందే విడుదల తేదీని అనౌన్స్ చేసి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే మేమింకా విడుదల తేదీని డిసైడ్ చేయలేదు. సూర్యకు సంబంధించిన షూట్‌ కంప్లీట్ అయింది. బాబీ దేవోల్‌పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు, కొంత ప్యాచ్‌ వర్క్‌ పూర్తవ్వాల్సి ఉంది. 10 భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఓటీటీ వెర్షన్‌ విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా ఫోకస్​ అంతా పోస్ట్‌ ప్రొడెక్షన్‌పైనే ఉంది" అని నిర్మాత అన్నారు. కంగ అనే పరాక్రముడి కథతో 'కంగువా' సినిమాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు బయట కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది.

Vikram Thangalaan Movie : తమ బ్యానర్‌లోనే నిర్మితమవుతున్న మరో సూపర్​ ప్రాజెక్ట్‌ 'తంగలాన్‌' సినిమా గురించి నిర్మాత ధనంజయన్ మాట్లాడారు. ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. "ఇదొక యూనివర్సల్‌ కథ. ఆడియెన్స్​ను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దడం ఓ ఛాలెంజ్​. భారీ స్థాయిలో రిలీజ్​ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్​ మార్కెట్‌లోనూ ప్రమోషన్స్‌ చేస్తాం. నార్త్​తో పాటు విదేశాల్లో ప్రచారం చేయడానికి విక్రమ్‌ సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి నాటికి సినిమా కంప్లీట్ అయితే దానికి అనుగుణంగా రిలీజ్ చేస్తాం" అని పేర్కొన్నారు. కాగా, విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్‌ కథానాయిక నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details