తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలో 'ప్రేమలు' జోరు- తొలి మలయాళ సినిమాగా రికార్డ్! - Premalu OTT - PREMALU OTT

Premalu OTT Records: మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు' ఓటీటీలో అరుదైన రికార్డు సాధించింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 6:29 PM IST

Updated : May 6, 2024, 7:33 PM IST

Premalu OTT Records:మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు' ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా మరో ఘనత అందుకుంది. గతనెల ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ప్రేమలు ఇప్పటివరకు 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్​తో కొత్త రికార్డు అందుకుంది. ఒక మలయాళ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్​లో స్ట్రీమింగ్ అవ్వడం ఓ ఘనత. ఈ క్రమంలో ఓటీటీలో అత్యధిక నిమిషాలు స్ట్రీమింగ్​ అయిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇక కామెడీ, ఫీల్​గుడ్ లవ్​స్టోరీ నో యాక్షన్, జీరో ఫైట్ సీన్స్​తో తెరెకక్కిన ఈ సినిమాకు యువత నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా ప్రేమలు మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమాకు 90's బయోపిక్ వెబ్​ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. దీంతో తెలుగు ఆడియెన్స్​కు ఈ సినిమా మరింత కనెక్ట్ అయ్యింది. చిన్న సినిమాగా కేవలం రూ.9 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ప్రేమలు వరల్డ్​వైడ్​గా రూ.100+ కోట్లు వసూల్ చేసింది.

ఈ సినిమాను గిరీశ్ ఏడి తెరకెక్కించారు. విష్ణు విజయ్ సంగీంతం అందించిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో నస్నెన్ కే గఫార్, మమితా బైజు, శ్యామ్ మోహన్, మీనాక్షీ రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీమ్, మ్యాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ తదితరులు నటించారు.

ఒక్క సినిమాతో ఫుల్ ఫేమస్
యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీస్​లో చాలా వరకు ఇదే స్టోరీ ఉంటుంది. ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్​ అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ తొలుత వాళ్ల లవ్​ ట్రాక్ నడవదు. ఆ తర్వాత అదే స్టోరీలో ఎన్నో ట్విస్ట్​లు వస్తుంటాయి. ప్రేమ‌లు కూడా అలాంటి స్టోరీనే. కానీ ఇందులో హీరో హీరోయిన్ల నటన సినిమాకే ప్లస్ పాయింట్​గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ మమితా బైజు ఈ చిత్రానికే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో ఆమె ఇట్టే ఒదిగిపోయింది. తన యాక్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్​కు యూత్ ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసిన ఈమె గురించే టాక్ నడుస్తోంది.

ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ రెండు సీన్లు చూశారా - ఇప్పుడందరూ దీని గురించే చర్చ! - Manjummel Boys OTT

ఈ వారం OTTలోకి 15 సినిమాలు - ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ​ కూడా! - This Week OTT Releases

Last Updated : May 6, 2024, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details