Prabhas Spirit Update :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్‌రెడ్డి వంగ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుందని మేకర్స్ ఇదివరకే చెప్పారు. ఇక ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఓ నిజయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని డైరెక్టర్ సందీప్‌రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు.
'స్పిరిట్' క్రేజీ అప్డేట్- ఒకటి కాదు మూడు లుక్స్‌లో కనిపించనున్న ప్రభాస్! - PRABHAS SPIRIT UPDATE
ప్రభాస్ స్పిరిట్ అప్డేట్- డార్లింగ్ మూడు లుక్స్‌లో కనిపించనున్నారట!
Published : Nov 19, 2024, 7:55 AM IST
తాజాగా సినిమాపై మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. బ్లాక్‌బస్టర్ మూవీ 'యానిమల్'లో రణ్‌బీర్ కపూర్ తరహాలో ప్రభాస్ కూడా మరో రెండు కొత్త లుక్స్‌లో కనిపించే అవకాశం ఉందట. అందులో ఒకటి పోలీస్ లుక్ అని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన రెండు లుక్స్ ఎలా ఉండనున్నయోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా, ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. దాదాపు ఆరు నెలలపాటు కంటిన్యూగా చిత్రీకరణ జరగనుంది. ప్రభాస్ కూడా నాన్‌స్టాప్‌గా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు. అయితే వచ్చే ఏడాదే సినిమా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిస్తోంది. ఈ లెక్కన అన్ని అనుకున్నట్లు జరిగితే మారుతి 'రాజాసాబ్'తో పాటు, ప్రభాస్- సందీప్‌రెడ్డి ర్యాంపేజ్ 2025లోనే చూసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో నటించనున్న మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.