తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్పిరిట్'​లో ప్రభాస్ లుక్​ ఇదేనట! - Prabhas Spirit Movie - PRABHAS SPIRIT MOVIE

Prabhas Spirit Movie: సందీప్​ వంగాతో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్​. తాాజాగా ఈ చిత్రంలో ప్రభాస్​ ఎలాంటి లుక్​లో కనిపించనున్నారో తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 2:42 PM IST

Prabhas Spirit Movie:ప్రస్తుతం సినీ ప్రియుల నోట రెబల్​ స్టార్ ప్రభాస్​ నటించిన కల్కి 2898 AD సినిమా పేరే వినిపిస్తోంది. జూన్​ 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండడంతో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఈ భారీ బడ్జెట్​ ప్రాజెక్డ్​ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సోషల్​ మీడియా అంతా కల్కినే కనిపిస్తోంది.

అయితే ప్రభాస్​ ఈ చిత్రంతో పాటు మరిన్ని సినిమాలను లైన్​లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి వరుసగా పెద్ద ఫ్రాజెక్ట్​లే రానున్నాయి. నెక్ట్స్​ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సలార్​ 2లో ఊర మాస్ లుక్​లో కనిపించనున్నారు. అలానే మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ కోసం వింటేజ్ లుక్​లో కనిపించనున్నారట. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. వీటన్నిటి తర్వాత ప్రభాస్ యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో ఓ భారీ సినిమా చేస్తున్నారు. పోలీస్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది.

ఈ మూవీ షూటింగ్ అక్టోబర్​లో ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. అయితే యానిమల్​లో రణ్​బీర్​ను వంగా డిఫరెంట్(వైల్డ్​, సాఫ్ట్​, రొమాంటిక్​)​ షేడ్స్​లో చూపించిన విధానానికి అంత ఫిదా అయిపోయారు. దీంతో స్పిరిట్​లో ప్రభాస్​ను ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలో మొదలైంది. దీని కోసం కూడా డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ వార్త బయటకు వచ్చింది. స్పిరిట్​లో ప్రభాస్​ను రెండు డిఫరెంట్ లుక్స్​లో వంగా చూపించనున్నారని తెలుస్తోంది. మొదటి లుక్​లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా వైల్డ్​గా చూపించనున్నారట. అంటే తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝళిపించనున్నారనమాట. మరో లుక్​లో ప్రభాస్ ఎంతో స్టైలిష్​గా కనిపించనున్నారని సమాచారం. ఏదేమైనా వీటిపై ఓ క్లారిటీ రావాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఈ సినిమాకి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారట. మూవీకి సంగీతం హైలైట్​గా నిలవనుంది చిత్రబృందం మొదటి నుంచి చెబుతోంది.

'కల్కి' అఫీషియల్​ టోటల్​ రన్​​ టైమ్​ వచ్చేసింది - ఎంత సేపంటే?

మాట్లాడలేక ప్రభాస్ కష్టాలు! - తెగ నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో చూశారా? - Kalki 2898AD Pre Release Event

ABOUT THE AUTHOR

...view details