Prabhas Upcoming Movies :టాలీవుడ్‌లోని మోస్ట్ వెర్సటైల్ యాక్టర్స్‌లో ప్రభాస్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరో తన యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవలే వచ్చిన 'సలార్'తో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 'కల్కి2898 AD ' సినిమాతో మాసివ్ సక్సెస్ అందుకున్నారు. 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్‌కు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వాళ్లు కూడా ప్రభాస్ కోసం సినిమా చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక 'కల్కి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన 'కల్కి'తో పాటు 'సలార్ 2', 'రాజాసాబ్', 'స్పిరిట్', 'కన్నప్ప' మూవీస్‌కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ సినిమాల షూటింగుల్లో యాక్టివ్గానే పాల్గొంటున్నారు. 'కల్కి' చిత్రీకరణ సమయంలోనే అప్పుడప్పుడు ఈ రెండు సెట్స్‌లోనూ సందడి చేసేవారు.
'సలార్ : శౌర్యంగ పర్వం' రీసెంట్‌గానే మొదలైంది. పార్ట్ 1 సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ప్రశాంత్ నీల్ ఈ రెండో పార్ట్‌ను మొదటి దానికంటే ఎక్కువ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఖాన్సారాను ఇంకాస్త విస్తృతంగా చూపించాలనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది.
ఇది కాకుండా సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'స్పిరిట్'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారన్న విషయం వల్ల ఈ చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న డైరెక్టర్ త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను లాక్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్ కూడా మరింత ఆలస్యమయ్యేలా ఉంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.