తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ 'స్పిరిట్​'​ అప్డేట్​ - దూసుకెళ్లేందుకు సిద్ధంగా! - SPIRIT MOVIE SHOOTING

ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ అప్డేట్​ - అనుకున్న దానికన్నా వేగంగా!

Spirit Movie Shooting
Spirit Movie Shooting (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 4:21 PM IST

Spirit Movie Shooting : దర్శకుడు సందీప్ వంగా రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్​లో తన హవా కొనసాగిస్తున్నారు. తీసింది మూడు సినిమాలే(అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్​) అయినా సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ బీటౌన్​లో టాప్​ రేంజ్​లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్​ 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం హర్షవర్ధన్ రామేశ్వర్​ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్​ను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను డిసెంబర్​లో సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోందని సమాచారం.

అయితే ఈ స్పిరిట్​ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్​ జరిపి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. రీసెంట్​గానే నిర్మాత భూషణ్ కుమార్ కూడా భూల్ భులయ్యా 3 ప్రమోషన్స్​లో స్పిరిట్ చిత్రాన్నీ వేగంగా పూర్తిచేసేలా ప్లానింగ్ జరుగుతోందని చెప్పారు. స్పిరిట్ మొదలుపెట్టిన ఆరు నెలలకే యానిమల్ పార్క్(సందీప్​ వంగానే దర్శకుడు)​ కూడా మొదలు పెడతారని తెలిపారు.

ఇప్పటికే కెరీర్​లో తొలిసారిగా పవర్​ ఫుల్​ పోలీస్ ఆఫీసర్​ పాత్ర చేయబోతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ టెస్ట్​ను కూడా ఇటీవలే ఓకే చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. పైగా ప్రభాస్​కు ప్రస్తుతం ఉన్న వరస కమిట్ మెంట్ల దృష్ట్యా ఒకే దర్శకుడికి ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బాహుబలి, సాహో, రాధే శ్యామ్ తర్వాత ఇకపై ఆలస్యానికి చోటివ్వకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్​కు ఆ మధ్య హామీ ఇచ్చారు ప్రభాస్. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ది రాజా సాబ్, ఫౌజీలు నిర్మాణంలో ఉండగానే హోంబాలే ఫిల్మిస్​కు మూడు పాన్ ఇండియా చిత్రాల కమిట్మెంట్లు కూడా ఇచ్చేశారు. కల్కి, సలార్ సీక్వెల్స్ కూడా చేయనున్నారు.

కాబట్టి స్పిరిట్ కోసం ఎక్కువ ఏళ్ల పాటు ఎదురు చూసే అవసరం పడదనే చెప్పాలి. పైగా సందీప్ వంగా కూడా వరుస ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టారు. స్పిరిట్ పూర్తవ్వగానే యానిమల్ పార్క్ మొదలు పెడతారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం రెడీ చేస్తున్న స్క్రిప్ట్ పనులపై దృష్టి పెడతారు. పుష్ప 2 ది రూల్ పూర్తయ్యాక బన్నీ త్రివిక్రమ్​తో ఓ సినిమా చేస్తారు. ఇది పూర్తయ్యే లోగా సందీప్​ వంగా, స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని బన్నీ కోసం రెడీ అవుతారు.

అందాల పోటీల్లో భారత్‌కు మరో కిరీటం - ఎవరీ మిస్ టీన్ యూనివర్స్ తృష్ణా రే?

1500 ఏళ్ల నాటి ప్రపంచం, రూ.300 కోట్ల బడ్జెట్​ - 'కంగువా' 10 ఆసక్తికర విశేషాలివే!

ABOUT THE AUTHOR

...view details