This Week Movie Releases : బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం థియేటర్లలోకి మరికొన్ని సినిమాలు రానున్నాయి. మరికొన్ని చిత్రాలు ఓటీటీల్లో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.
సుకుమార్ కుమార్తె
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి లీడ్ రోల్లో నటించిన తొలి చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. ఈ నెల 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో గాంధీ సిద్ధాంతాల్ని అనుసరించే అమ్మాయిగా సుకృతి కనిపించనుంది. పాత్ర డిమాండ్ మేరకు గుండు కూడా చేయించుకుంది. తాను పుట్టిన ఊరును కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేసింది?అన్నది తెరపై చూడాల్సిందే.
త్రిష కొత్త సినిమా
టొవినో థామస్ - త్రిష ప్రధాన పాత్రల్లో అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం 'ఐడెంటిటీ'. మలయాళంలో రిలీజై సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 24న తెలుగులో విడుదల కానుంది. ఓ కేసును ఛేదించే నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ కేసుకు త్రిషకు ఏం సంబంధం? చివరకు అది ఛేదించగలిగారా? అనేది సినిమా కథ.
ప్రేమలు బ్యూటీ
ప్రేమలు బ్యూటీ మమితా బైజు, అక్షయ్, ఐశ్వర్య లీడ్ రోల్స్‌లో దినేశ్‌బాబు తెరకెక్కించిన చిత్రం 'డియర్ కృష్ణ'. శ్రీకృష్ణుడికి, ఆయన భక్తుడికి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఇక స్టార్ హీరో విజయ్ సేతుపతి 'విడుదల 2' ఇప్పటికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
ఓటీటీలో అలరించనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఈటీవీ విన్
- వైఫ్ ఆఫ్ : జనవరి 23
నెట్‌ఫ్లిక్స్
- ది నైట్ ఏజెంట్ సీజన్ 2: జనవరి 23 (వెబ్‌సిరీస్)
- ది సాండ్ క్యాసిల్:జనవరి 24
అమెజాన్ ప్రైమ్ వీడియో
- విడుదల 2 : స్ట్రీమింగ్ అవుతోంది
ఆహా
- రజాకార్ : జనవరి 24 (ఆహా గోల్డ్ యూజర్స్‌కు జనవరి 22 నుంచి)
జీ5
- హిసాబ్ బరాబర్: జనవరి 24
క్రిస్మస్ స్పెషల్ - ఈ వారం థియేటర్/ఓటీటీలో 20 సినిమా,సిరీస్‌లు!
ఈ వారం OTTలోకి ఏకంగా 35 సినిమా, సిరీస్‌లు - ఆ 5 చిత్రాలు వెరీ స్పెషల్!