Prabhas Upcoming Movies : ఒకేసారి ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో కలిసి జర్నీ చేయడంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత రాటుదేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఇలానే కొనసాగిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మువీలో నటిస్తున్న ఆయన మరో రెండు కొత్త చిత్రాలని ఏకకాలంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్సాల్సిన పీరియాడిక్ లవ్ డ్రామాను జులైలో ప్రారంభించనున్నారని తెలిసింది. అలాగే దీంతోపాటు, సలార్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారని సమాచారం అందింది. వచ్చే నెల నుంచే ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్ మొదలు కానుందట. అయితే ప్రభాస్ జులై నుంచి ఈ మూవీ షూటింగ్లో పాల్గొనున్నట్టు తెలిసింది. అంటే ఒకే నెలలో రెండు సినిమాల చిత్రీకరణలో ఆయన పాల్గొనున్నారనమాట. అలానే మరోవైపు రాజాసాబ్ షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఇంకా ఈ సంవత్సరంలోనే సందీప్ రెడ్డి వంగా చిత్రాన్ని కూడా మొదలు పెడతారట. ఈ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని తెలుస్తోంది. వారు ఏళ్ల తరబడి ఎదురుచూసే ఛాన్స్ లేకుండా వెంట వెంటనే ప్రభాస్ తన సినిమాలతో అలరించనున్నారని అర్థమవుతోంది.