Prabhas Rejected Movies : తన పర్సనాలిటీ తగ్గట్టుగా అనిపించే పాత్రలను ఎంపిక చేసుకుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అయితే ఇలా ఆచూ తూచీ కథను ఎంచుకునే క్రమంలో ప్రభాస్ చాలాబ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నారట. అందులో దాదాపు అన్నీ సూపర్ హిట్ చిత్రాలే ఉన్నాయి. అలా ఆ కథలను రిజెక్ట్ చేయకుండా ఉండుంటే ఈ పాన్ ఇండియా స్టార్ ఖాతాలో మరెన్నో హిట్ సినిమాలు ఉండేవట. అవేంటో ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారో ఓ లుక్ వేద్దాం.
దిల్ :
వివి వినాయక్ దర్శకత్వంలో 2003లో విడుదలైన దిల్ సినిమా అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఒక్క దెబ్బకు నితిన్‌ను స్టార్ చేసింది. అయితే ఈ యూత్ ఎంటర్టైనర్ కథను వినాయక్ ముందు ప్రభాస్‌కే చెప్పారట.
సింహాద్రి :
దిగ్గజ దర్శకుడు రాజమౌళి- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలే 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సింహాద్రి. అయితే ఈ కథని మొదట ప్రభాస్‌కు వినిపించాడట రాజమౌళి. కానీ ప్రభాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. కాగా, ప్రభాస్-రాజమౌళి కాంబోలో 2005లో ఛత్రపతి సినిమా రావడం గమనార్హం.
ఆర్య :
టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య. ఈ సినిమాతో బన్నీ కెరీర్ ఓ మలుపు తిరిగింది. ఇటీవల 25ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫర్ మొదట ప్రభాస్‌కు వెళ్లిందట. కానీ ఈ క్యారెక్టర్ తనకు సెట్ కాదని తిరస్కరించారట.
నాయక్ :
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వివి వినాయక్ డైరెక్ట్ చేసిన సినిమా నాయక్. ఇందులో కాజల్ అమలాపాల్ నటించారు. మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కథ మొదట ప్రభాస్‌కు చెప్పారట వినాయక్.
ఒక్కడు :
దర్శకుడు గుణశేఖర్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ఒక్కడు. భూమిక హిరోయిన్‌గా నటించిన ఈ సినిమా మహేశ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆఫర్ మొదట ప్రభాస్‌కే వచ్చిందట. కానీ ఆయన ఈ చిత్రాన్ని వదులుకున్నారట.
బృందావనం :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బృందావనం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్, సమంతతో ఆడిపాడారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ ప్రభాస్‌కే వినిపించారట వంశీ. కానీ డార్లింగ్ నో చెప్పారట.
కిక్ :
మాస్ మహారాజ రవితేజ- అందాల హీరోయిన్ ఇలియానా నటించిన కిక్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా కథ ఫస్ట్ ప్రభాస్‌కు చెప్పారట దర్శకుడు సురేందర్ రెడ్డి.
ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేశారట ప్రభాస్. అందులో గోపిచంద్ నటించిన జిల్, ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్‌శీను కూడా ఉన్నాయట. ఏది ఏమైనా ఈ సినిమాలన్నీ డార్లింగ్ ప్రభాస్ చేసుంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉండేది కదా!.