Kalki 2898 AD OTT Trimmed 6 Minutes : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి విడుదలైంది. ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో దక్షిణాది భాషల్లో, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆ వెర్షన్లు అన్నీ 6 నిమిషాల పాటు ట్రిమ్ చేశారట.
కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైనప్పుడు 181 నిమిషాలు, అంటే 3 గంటల ఒక నిమిషం ఉంది. అప్పుడు సినిమా పాజిటివ్ దక్కించుకున్నప్పటికీ రన్ టైమ్ ఎక్కువ ఉందని కామెంట్లు వినిపించాయి. దీనికి నాగ్ అశ్విన్ కథ కోసం అంత రన్ టైమ్ తప్పలేదని చెప్పినా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేశాక ఏకంగా 6 నిమిషాలను తగ్గించేశారు. దీంతో ప్రస్తుతం కల్కి రన్ టైమ్ 175 నిమిషాలుగా, అంటే 2 గంటల 55 నిమిషాలు అయింది.
ఏ సీన్లు తగ్గించారంటే? - మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశం. ఇందులో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ ఉంటుంది. దానిని తీసేశారట.
ఇంట్రడక్షన్ సీన్ తర్వాత ఇద్దరు భారీ ఆకారం ఉన్న వ్యక్తులతో ప్రభాస్ ఫైట్ చేస్తారు. ఆ సన్నివేశం నిడివిని తగ్గించారు.