Kalki 2898 AD Movie :కల్కి 2898 AD నుంచి తాజాగా వచ్చిన అప్డేట్తో బుజ్జి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న(మే 17) ప్రభాస్ చెప్పిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందిన కారు అనేలా తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. పాన్ వరల్డ్ స్థాయిలో ఊహకు మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మే 17న ప్రభాస్ చేసిన ఓ పోస్ట్‌తో కల్కి సినిమా విపరీతంగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని గంటలు ఆగి 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అంటూ మరో పోస్ట్‌తో మరింత ఆసక్తిని పెంచారు. దీంతో అసలు బుజ్జి ఎవరు? ఎలా ఉంటుంది? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి బోలేడైంది.